ETV Bharat / state

అనంతపురం కలెక్టర్​​పై వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

ఏపీలోని అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడిపై వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ గ్రామంలోని ఊరేగింపు విషయంలో నెలకొన్న వివాదం నేపథ్యంలో ఎమ్మెల్యే ఘాటుగా స్పందించారు. కలెక్టర్ వైఖరి వల్లే ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడని ఆరోపించారు. కలెక్టర్​కు జిల్లా మెజిస్టీరియల్ అధికారాలు ఉంటే చంపేస్తారా..? అని ప్రశ్నించారు.

అనంతపురం కలెక్టర్​​పై వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
అనంతపురం కలెక్టర్​​పై వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
author img

By

Published : Mar 13, 2021, 8:53 PM IST

ఏపీలోని అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుపై ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శివరాత్రి సందర్భంగా తాడిమర్రి మండలం చీలవారిపల్లిలో దేవతామూర్తుల ఊరేగింపుపై వివాదం నెలకొంది. ఊరేగింపును పోలీసులు అడ్డుకోగా.. గ్రామానికి చెందిన బాల్​రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అనంతపురం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాల్ రెడ్డిని ఎమ్మెల్యే కేతిరెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పరామర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్​పై ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో కలెక్టర్ చిచ్చుపెట్టారని ఆరోపించారు. జిల్లాలో అన్నీ తానై ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారని విమర్శించారు.

'కలెక్టర్ గంధం చంద్రుడు వైఖరి వల్లే బాల్ రెడ్డి ఆత్మహత్యాయత్నం చేశాడు. కులాల మధ్య చిచ్చురేపే విధంగా కలెక్టర్ యత్నించాడు. చీలవారిపల్లిలో ఊరేగింపుపై గతేడాది ఇదే తరహా ఇబ్బంది జరిగింది. ఈ వేడుక నిర్వహణకు సంబంధించి అంకేనుపల్లి(కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం), చీలవారిపల్లి మధ్య వివాదం ఉంది. గతంలోనే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ఆలయాన్ని దేవాదాయశాఖ పరిధిలోకి తీసుకొచ్చాను. అసలు ఈ గ్రామానికి సంబంధించిన చరిత్ర కలెక్టర్​కు ఏం తెలియదు. గ్రామస్థుల నుంచి ఎలాంటి ఫిర్యాదు లేనప్పటికీ ఆర్డీవోను పంపించి కార్యక్రమ నిర్వహణను పూర్తిగా ఆపేశారు. చేతనైతే పండుగను ప్రశాంతంగా జరిపించాలి. కానీ వందలాది మంది పోలీసులను పెట్టి పండగను అడ్డుకున్నారు. ఎమ్మెల్యేలుగా మాకు తెలియదా గ్రామంలోని సమస్యలు..? ఈరోజు ఉండి రెండు రోజుల్లో వెళ్లిపోయేవారు ఇష్టమెుచ్చినట్లు చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కలెక్టర్ లెక్క చేస్తున్నారా..? ఇందుకు సంబంధించిన వీడియోలను సీఎం దృష్టికి తీసుకెళ్తా. మేం ప్రజాప్రతినిధులం. ఆయన పబ్లిక్ సర్వెంట్. మెజిస్టీరియల్ అధికారాలు ఉంటే చంపేస్తారా..? కులాల మధ్య చిచ్చు పెడతారా..? ఏ హక్కుతో పండుగను ఆపారు..? ఆయన చేసిన పనుల గురించి చెప్పాలంటే పేజీలు సరిపోవు.' - కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే

ఇదీ చదవండి: లైవ్​ వీడియో: చెట్టును ఢీకొన్న కారు.. వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.