YSRCP MINISTERS ON IPPTAM: ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతపై పవన్ కల్యాణ్ రాజకీయం చేయడం తగదని రాష్ట్ర మంత్రులు మండిపడ్డారు. సంక్షేమం, అభివృద్ధిని చూసి తెలుగుదేశం, జనసేన ఓర్వలేకపోతున్నాయని ఆరోపించారు.
ఇప్పటంలో సినిమా ష్యూటింగ్కు వచ్చినట్టు రావటం, అరవటం ఆయన మాట్లడిన తీరు చూస్తే ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇప్పటంలో అక్రమంగా కట్టుకున్న ప్రహరీ గోడలు, అక్రమాణాలు చేసిన వారికి నోటిసులు ఇచ్చారు. ఆ తరువాత మళ్లీ నోటిసులు ఇచ్చారు. ఈ రోజు అక్కడ ఉన్న ప్రజలకు రోడ్డు సౌకర్యం కల్పించి .. అక్కడ ఉన్న ప్రజల అంగికారం తరువాతే చేస్తుంటే.. దాన్ని కూడా రాజకీయం చేయటం సిగ్గు చేటు. - రోజా రాష్ట్ర మంత్రి
పవన్ కల్యాణ్ గురించి మాట్లడితే పాపం చిన్న చిన్న పిల్లలు యూట్యూబ్లో పెడుతుంటారు. నన్నడిగితే పవన్ కల్యాణ్ రాజకీయ నాయకుడు కానే కాదు. - నారాయణస్వామి, ఉప ముఖ్యమంత్రి
పవన్ కల్యాణ్ ఇప్పటం పర్యటనపై మంత్రి రజని విమర్శులు గుప్పించారు. ప్రజలకు మేలు చేసే దానిపైన రాజకీయలు తగదని అన్నారు. ఇప్పటంలో జరుగుతున్నది రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని ఆమె అన్నారు.
పని కట్టుకుని పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామానికి వెళ్లి.. అక్కడ ఉన్న వాళ్లను రెచ్చగొట్టడము, అలజడులు సృష్టించటం మనమంతా చూస్తున్నాం. పవన్ కల్యాణ్ ప్రజల సమస్యల కోసమో, ప్రజలకు మేలు చేసే దాని కోసం రాజకీయం చేస్తే దానిని కాదని అనము. కానీ, పవన్ కల్యాణ్ కేవలం తెదేపా సంక్షేమం కోసం, చంద్రబాబు నాయుడు ప్రయోజనం కోసం పనిచేస్తున్నారు. దీనిని రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. - విడదల రజని, రాష్ట్ర మంత్రి
ఇవీ చదవండి: