Sharmila reacts to Revanth Reddy Comments : పీసీసీ అధ్యక్షుడి రేవంత్‌రెడ్డిపై వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నాది ఆంధ్ర అయితే.. మరి సోనియా గాంధీ ఎక్కడ. . ?' అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఆమెది ఇటలీ కాదా అని షర్మిల అడిగారు. భారతదేశంలో ఒక మహిళ తన పుట్టి పెరిగిన ప్రాంతాన్ని వదిలేసి.. ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. అనంతరం సొంత వాళ్లను కాదనుకొని.. బిడ్డలను కనీ.. తనని తానే అంకితం చేసుకుంటుందని వివరించారు. ఇంత గొప్ప సంస్కృతిని అర్ధం చేసుకోవాలి అనుకుంటే సంస్కారం ఉండాలని ఆమె వ్యాఖ్యానించారు.
సోనియా గాంధీకి ఇక్కడ రాజకీయాలు వద్దని చెప్పగలరా.. : త్యాగం చేసిన మహిళను గౌరవించాలంటే సంస్కారం ఉండాలని అన్నారు. అంతటి సంస్కారం లేదని ఆయనంతట ఆయనే నిరూపించుకున్నారని తెలిపారు. తనకి చీర, సారే పెడతామని.. ఇక్కడ రాజకీయాలు చేయవద్దని అన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను గుర్తు చేశారు. ఈ ఆరోపణలు విడ్డూరంగా ఉన్నాయని విమర్శించారు. తనకి చెప్పిన విధంగానే సోనియా గాంధీకి చీర, సారే పెడుతున్నాము.. ఇక్కడ రాజకీయాలు చేయవద్దని చెప్పేంత ధైర్యం ఉందా అని నిలదీశారు. ప్రస్తుతం ఆయన అభద్రత భావంతో ఉన్నారని పేర్కొన్నారు. ఆమె వల్ల రేవంత్ రెడ్డి ఉనికి ఎక్కడ పోతుందో అని భయపడుతున్నారని ఎద్దేవ చేశారు. దీనివల్లే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి అల్లుడు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వ్యక్తే అని గుర్తు చేశారు.
"నాది ఆంధ్ర అయితే.. సోనియాది ఇటలీ కాదా? రేవంత్ రెడ్డికి మహిళను గౌరవించే సంస్కారం లేదని ఆయనంతట ఆయనే నిరూపించుకున్నారు. తనకి చీర, సారే పెడతామని.. ఇక్కడ రాజకీయాలు చేయవద్దని నాకు చెప్పిన విధంగా సోనియా గాంధీకి రేవంత్ రెడ్డి చెప్పే ధైర్యం ఉందా? నా వల్ల తన ఉనికి ఎక్కడ పోతుందో అని అభద్రత భావాన్ని కలిగి ఉన్నారు. తన ఉనికిని కాపాడుకోడానికి మాత్రమే నాపై ఇలాంటి ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి అల్లుడుది కూడా ఆంధ్రప్రదేశ్ కదా!" - షర్మిల, వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు
ఇవీ చదవండి :