తను ఎవరో విసిరిన బాణాన్ని కాదని తను తెలంగాణ ప్రజల బాణాన్ని అని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. తనకు కులాలు, మతాలు అంటగట్టొద్దని చెప్పారు. తమది లౌకిక పార్టీ అని స్పష్టం చేశారు. మేమే ప్రధాన ప్రతిపక్షం అవుతామన్నారు. సంక్షేమం, సమానత్వం, స్వయం సంవృద్ధి తమ పార్టీ ఎజెండా అని తెలిపారు. డబ్బులు సంపాదించుకోవడం కోసం తెలంగాణలో అధికారాన్ని వాడుతున్నారని ఆరోపించారు. నిజమైన అధికారం ప్రజల చేతిలో ఉండాలన్నారు. వైఎస్ఆర్ 30 ఏళ్ల పాటు ప్రజలకు సేవ చేశారని చెప్పారు.
నేను తెలంగాణలో పెరిగాను, ఇక్కడే నా స్నేహితురాలి ఇంటికి వెళ్లి షీర్కుర్మా తిన్నాను. బతుకమ్మ, బోనాలు పండుగను స్నేహితురాలి ఇంటికి వెళ్లి చేసుకున్నాం. ప్రతి ఒక్కరి ఒక మతం ఉంటుంది. మీ మతం మీకు ఉంటుంది. నా మతం నాకు ఉంటుంది. మాది లౌకక పార్టీ. మతాలు, కులాలకు అతీతం. నాకు మతాన్ని అంటగట్టొద్దు. నాకు కులాన్ని అంటగట్టొద్దు.
-షర్మిల, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు
ఇదీ చదవండి: Ys Sharmila : 'రాసి పెట్టుకోండి...నేను ప్రభంజనం సృష్టిస్తా..'