దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పదో వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేతలు పంజాగుట్టలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్, మహిళా కాంగ్రెస్ నేత నేరెళ్ల శారద, గూడూరు నారాయణరెడ్డి, నిరంజన్, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమకుమార్, కార్యకర్తలు నివాళులు అర్పించారు. వైఎస్ అందించిన సేవలను ఉత్తమ్ గుర్తుచేసుకున్నారు.
ఇదీ చూడండి :గాంధీభవన్‌లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పదో వర్ధంతి