YS Sharmila React on ED Attacks on Congress Leaders : బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర రాజకీయాలకు ఐటీ దాడులే నిదర్శనమని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటమి భయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రత్యర్థులను నైతికంగా ఎదుర్కొనే దమ్ములేక అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఐటీ దాడులకు పాల్పడుతున్నారన్నారని వైఎస్ షర్మిల తన ఎక్స్ (ట్విటర్) వేదికగా ఆరోపణలు చేశారు.
గెలిచే సత్తా లేక కాంగ్రెస్ నాయకులపై చేసే ఐటీ, ఈడీ దాడులకు ప్రధాని మోదీ(PM Modi) కూడా కేసీఆర్‌కు సాయం చేస్తున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు ఒకే తానులోని ముక్కలని ఎక్స్(Twitter) వేదికగా వెల్లడించారు. గల్లీలో కుస్తీ పడుతూ దిల్లీలో దోస్తీ నడుపుతున్నారని విమర్శించారు. తెరచాటు రాజకీయాలకు ప్రజలు త్వరలో బుద్ధి చెబుతారన్నారు. సోదాల పేరుతో కాంగ్రెస్ నాయకులను, ఆ పార్టీ మద్దతుదారులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, దీనిని ప్రజలు హర్షించరని తెలిపారు.
YS Sharmila Fires on BJP and BRS Partys : లిక్కర్ స్కాం(Delhi Liquor Scam Case)లో కవితపై ఎలాంటి చర్యలు లేవని, భూకబ్జాలతో అడ్డగోలు దోపిడీకి పాల్పడిన బీఆర్ఎస్ నాయకులపై ఎలాంటి ఐటీ, ఈడీ సోదాలు జరగడం లేదని మండిపడ్డారు. ప్రజలు అధికారం కట్టబెట్టింది ప్రజాసేవ కోసం కానీ ప్రతిపక్షాలను అణగదొక్కేందుకు కాదని స్పష్టం చేశారు. కేసీఆర్, మోదీ పాలనలకు తెలంగాణ ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారని వై.ఎస్ షర్మిల పేర్కొన్నారు.
-
బీజేపీ,బిఆర్ఎస్ కుట్ర రాజకీయాలకు ఐటీ దాడులే నిదర్శనం
— YS Sharmila (@realyssharmila) November 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
ఎన్నికల్లో ఓటమి భయంతో కేసీఆర్ కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నాడు. ప్రత్యర్థులను నైతికంగా ఎదుర్కొనే దమ్ము లేక అధికారాన్ని వాడుకుని ఐటీ దాడులకు పాల్పడుతున్నాడు.ఎన్నికల్లో గెలిచే సత్తా లేక కాంగ్రెస్ నాయకులపై ఐటీ, ఈడీ సోదాలు… pic.twitter.com/5LcauGOGIN
">బీజేపీ,బిఆర్ఎస్ కుట్ర రాజకీయాలకు ఐటీ దాడులే నిదర్శనం
— YS Sharmila (@realyssharmila) November 22, 2023
ఎన్నికల్లో ఓటమి భయంతో కేసీఆర్ కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నాడు. ప్రత్యర్థులను నైతికంగా ఎదుర్కొనే దమ్ము లేక అధికారాన్ని వాడుకుని ఐటీ దాడులకు పాల్పడుతున్నాడు.ఎన్నికల్లో గెలిచే సత్తా లేక కాంగ్రెస్ నాయకులపై ఐటీ, ఈడీ సోదాలు… pic.twitter.com/5LcauGOGINబీజేపీ,బిఆర్ఎస్ కుట్ర రాజకీయాలకు ఐటీ దాడులే నిదర్శనం
— YS Sharmila (@realyssharmila) November 22, 2023
ఎన్నికల్లో ఓటమి భయంతో కేసీఆర్ కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నాడు. ప్రత్యర్థులను నైతికంగా ఎదుర్కొనే దమ్ము లేక అధికారాన్ని వాడుకుని ఐటీ దాడులకు పాల్పడుతున్నాడు.ఎన్నికల్లో గెలిచే సత్తా లేక కాంగ్రెస్ నాయకులపై ఐటీ, ఈడీ సోదాలు… pic.twitter.com/5LcauGOGIN
మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు- 'ప్రమోటర్ల నుంచి సీఎం బఘేల్‌కు రూ.508కోట్ల చెల్లింపులు'
ED Raids Congress Leader Gaddam Vivekanand House : మాజీ ఎంపీ, చెన్నూరు అభ్యర్ధి గడ్డం వివేకానంద్ ఇళ్లు కార్యాలయాల్లో మంగళవారం జరిగిన సోదాలపై ఈడీ(ED Raids) ప్రకటన విడుదల చేసింది. రూ.8కోట్ల బ్యాంకు లావాదేవీలపై తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా సోదాలు నిర్వహించిన ఈడీ.. దర్యాప్తులో ఎంఎస్ విజిలెన్స్ సెక్యూరిటీకి సంబంధించిన అసలైన వ్యాపార రాబడి కాదని తేలిందని వెల్లడించింది. విశాఖ ఇండస్ట్రీస్, ఎంఎస్ విజిలెన్స్ సెక్యూరిటీ మధ్య రూ.100కోట్ల లావాదేవీలు జరిగాయని.. కానీ వ్యాపారం ద్వారా రూ.20లక్షలు మాత్రమే ఆదాయం వచ్చిందని వెల్లడించింది.
ఆస్తులు అప్పులు కలిపి మరో రూ.64కోట్లు మాత్రమే బ్యాలెన్స్ షీట్‌లో ఉన్నాయన్న ఈడీ.. లావాదేవీలు మాత్రం రూ.200కోట్లకు పైగా జరిగినట్లు గుర్తించినట్లు తెలిపింది. ఇదంతా వివేక్ పరోక్షంగా నియంత్రిస్తున్నారని పేర్కొంది. ప్రాధమిక దర్యాప్తులో భాగంగా ఎంఎస్ విజిలెన్స్ సెక్యూరిటీ సంస్థ పెమా నిబంధనలు ఉల్లంఘించిందని అన్నారు. నిబంధనలకు విరుద్దంగా ఎంఎస్ ఎంఎస్ విజిలెన్స్ సెక్యూరిటీ సంస్థ దాని మాతృ సంస్థ యశ్వంత్ రియల్టర్స్‌లో విదేశీయుల షేర్లు ఎక్కువ ఉన్నట్లు గుర్తించామని వెల్లడించింది.
విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ బోగస్ : దీంతో పాటు పెమా నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇతర దేశంలో వివేక ఒక సంస్థను ఏర్పాటు చేసినట్లు గుర్తించామని ఈడీ తెలిపింది. సోదాల్లో భారీగా ఎలక్ట్రానికి పరికరాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని.. కంపనీలే లేకుండా వాటిపై కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నట్లుగా ఉన్న డాక్యుమెట్లను సైతం స్వాధీనం చేసుకున్నామని ప్రకటిచింది. దర్యాప్తులో భాగంగా విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ బోగస్‌గా తెలుస్తోందని పేర్కొంది.
హైదరాబాద్‌లో ఈడీ సోదాల కలకలం - మాజీ క్రికెటర్ల ఇళ్లలో కొనసాగుతోన్న తనిఖీలు
Ex MP Vivek Joins Congress : బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ గడ్డం వివేక్