వైఎస్సాఆర్ టీపీ అధినాయకురాలు వై.ఎస్ షర్మిల హైదరాబాద్‌లోని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగను పరామర్శించారు. ఇటీవల కాలుజారిపడి గాయాలైన మందకృష్ణకు... దిల్లీలో శస్త్రచికిత్స జరగింది. ఈ నేపథ్యంలో ఆయనను కలిసి... ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. మందకృష్ణ మాదిగ త్వరగా కోలుకోవాలని... తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్షించారు.
అనంతరం సెప్టెంబర్ 12న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి పట్టణంలో వైఎస్సాఆర్ టీపీ నిర్వహించే "దళిత భేరి" బహిరంగ సభకు మందకృష్ణను ఆహ్వానించారు. దళితుల పక్షాన తాము చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలవాలని షర్మిల కోరారు.
-
MRPS వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మందకృష్ణ మాదిగ గారిని ఈరోజు తన నివాసంలో కలసి పరామర్శించడం జరిగింది.ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాను.అలాగే Sept.12న YSR తెలంగాణ పార్టీ తిరుమలగిరిలో నిర్వహించే "దళిత భేరి" బహిరంగ సభకు ఆహ్వానించాను. pic.twitter.com/UpK74kX4bJ
— YS Sharmila (@realyssharmila) September 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">MRPS వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మందకృష్ణ మాదిగ గారిని ఈరోజు తన నివాసంలో కలసి పరామర్శించడం జరిగింది.ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాను.అలాగే Sept.12న YSR తెలంగాణ పార్టీ తిరుమలగిరిలో నిర్వహించే "దళిత భేరి" బహిరంగ సభకు ఆహ్వానించాను. pic.twitter.com/UpK74kX4bJ
— YS Sharmila (@realyssharmila) September 8, 2021MRPS వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మందకృష్ణ మాదిగ గారిని ఈరోజు తన నివాసంలో కలసి పరామర్శించడం జరిగింది.ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాను.అలాగే Sept.12న YSR తెలంగాణ పార్టీ తిరుమలగిరిలో నిర్వహించే "దళిత భేరి" బహిరంగ సభకు ఆహ్వానించాను. pic.twitter.com/UpK74kX4bJ
— YS Sharmila (@realyssharmila) September 8, 2021
శస్త్ర చికిత్స ఎందుకంటే..
ఎస్సీ వర్గీకరణ విషయం చర్చించడం కోసం మందకృష్ణమాదిగ దిల్లీకి వెళ్లారు. అక్కడ వారున్న నివాసంలో ఆయన కాలు జారిపడ్డారు. ఈ ఘటనలో ఆయన కుడి కాలు ఎముక ఫ్యాక్చర్ అయింది. వెంటనే ఆస్పత్రిలో చేరగా... శస్త్ర చికిత్స అవసరమని డాక్టర్లు తెలిపారు. చికిత్స అనంతరం మందకృష్ణ హైదరాబాద్కు వచ్చారు.
ఇదీ చూడండి: Kishan Reddy: మందకృష్ణను పరామర్శించిన కిషన్‌రెడ్డి