YS Sharmila Letters to Kavitha on Womans Reservations : మహాత్మా గాంధీ చెప్పినట్లు మీరు చూడాలి అనుకుంటున్న మార్పు.. మీ నుంచే మొదలుపెట్టాలని ఎమ్మెల్సీ కవితకు.. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిన దగ్గర నుంచి 5శాతం కూడా మహిళలకు సీట్లు ఇవ్వలేదని షర్మిల స్పష్టంచేశారు. తన అభిప్రాయంతో పాటు, ఇటీవల బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా సైతం పంపుతున్నానని, జాబితాతో పాటు ఒక కాలిక్యులేటర్ లింక్ సైతం పంపిస్తున్నట్లు తెలిపారు.
YS Sharmila on YSRTP Merger With Congress : 'పార్టీ విలీనంపై కాంగ్రెస్‌తో చర్చలు తుది దశకు వచ్చాయి'
బీఆర్ఎస్ జాబితా చూసి 33శాతం ఇచ్చారా లేదా లెక్కించాలని ఆమె స్పష్టం చేశారు. మద్దతు కూడగట్టే ముందు.. మీ తండ్రి కేసీఆర్‌తో ఈ విషయం చర్చించాలని విజ్ఞప్తి చేశారు. మహిళా బిల్లుకు మద్దతు కోరుతూ మీరు రాసిన లేఖ అందిందని.. తెలంగాణలో మహిళలకు న్యాయం చేయకుండా ఈ పోరాటాన్ని జాతీయ వేదికపైకి ఎలా తీసుకువెళ్తారు.. అని షర్మిల ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పార్టీ పుట్టిన దగ్గర నుంచి.. ఇప్పటి దాకా 5 శాతం కంటే ఎక్కువ సీట్లు కేటాయించలేదన్నారు. మంత్రి వర్గంలోనూ మహిళలకు ప్రాధాన్యత లేదని, సీఎం కూతురిగా మీ తండ్రి కేసీఆర్‌ని ఏనాడూ ఈ అంశంపై ఎందుకు ప్రశ్నించలేదన్నారు. మీ పార్టీలో, ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇవ్వకుండా దిల్లీ వేదికగా ఉద్యమం చేయడం హాస్యాస్పదం అని లేఖలో పేర్కొన్నారు.
Kavitha Dharna on Woman's Reservation : మహిళా రిజర్వేషన్‌పై ముందు మీ చిత్తశుద్ది నిరూపించుకోవాలని.. తెలంగాణ అసెంబ్లీలో ఎక్కువ మందికి ఈ ఎన్నికల్లో సీట్లు ఇవ్వండి..ఇదే మీ ఉద్యమానికి మొదటి అడుగు కావాలని సూచించారు. ఇక్కడ తేల్చకుండా దిల్లీ వేదికగా ఉద్యమం చేయడం.. బీఆర్ఎస్ ద్వంద వైఖరికి నిదర్శనం అన్నారు. మహిళా బిల్లుపై దేశవ్యాప్త మద్దతు కూడగట్టే ముందు కవిత కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు.
2004 నుంచి ఇప్పటి వరకు మహిళలకు బీఆర్ఎస్ ఇచ్చిన సీట్లు ఎన్ని..? 2014లో మహిళలకు 6 సీట్లు మాత్రమే కేటాయించారని గుర్తుచేశారు. 2018లో మీరిచ్చిన సీట్లు 4 అని మీకు కనపడటం లేదా..? సీట్ల కేటాయింపులో ఒక మహిళగా ఎందుకు ప్రశ్నించడం లేదు..? 2014 లో మీకు ఒక ఎంపీ స్థానం, 2019లో ఇద్దరికీ అవకాశం ఇదేనా మహిళలకు.. బీఆర్ఎస్ పార్టీ వేస్తున్న పెద్దపీట అని ప్రశ్నించారు.
YS Sharmila Latest News : బీఆర్ఎస్ మొదటి దఫా ప్రభుత్వంలో మహిళా మంత్రి ఎందుకు లేరు..? రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు ఎందుకు మహిళా కమిషన్‌ను పెండింగ్‌లో పెట్టారు ..? అని ప్రశ్నించారు. మహిళలపై దాడులు చేసి కించపరిచింది మీ పార్టీ కాదా..? ఉన్నట్లుండి మహిళా రిజర్వేషన్లు అంటూ ముందటేసుకున్న మీ ఆంతర్యం ఏంటి..? రాబోయే ఎన్నికల్లో మహిళల నుంచి వచ్చే వ్యతిరేకత దృష్ట్యా నష్ట నివారణ చర్యల్లో ఇది ఒక ఎత్తుగడనా ..? అని షర్మిల ప్రశ్నించారు.