ETV Bharat / state

విద్యార్థులపై దాడులు అమానుషం: షర్మిల - విద్యార్థులకు షర్మిల సంఘీభావం

కాకతీయ యూనివర్శిటీలో జరిగిన ఘటన గురించి తెలిసి వైఎస్ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు ప్రశ్నిస్తే వాళ్లమీద దాడులు జరపడం అమానుషం అన్నారు. ఘటనలో గాయపడిన విద్యార్థులకు, జర్నలిస్టుకు ఆమె సంఘీభావం తెలిపారు. లోటస్ పాండ్​లో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో ఆమె సమావేశమయ్యారు.

ys sharmila comment Attacks on ku students are inhumane
విద్యార్థులపై దాడులు అమానుషం: షర్మిల
author img

By

Published : Mar 10, 2021, 4:28 PM IST

Updated : Mar 10, 2021, 9:48 PM IST

విద్యార్థులు ముందుండి పోరాటం చేస్తేనే తెలంగాణ సాధ్యమైందని వైఎస్ షర్మిల అన్నారు. విద్యార్థుల బలిదానాల మీదనే ఇప్పటి పాలకులు అధికారంలోకి వచ్చారని ఆమె పేర్కొన్నారు. కాకతీయ యూనివర్శిటీలో జరిగిన ఘటన గురించి తెలిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు ప్రశ్నిస్తే.. వాళ్లమీద దాడులు జరపడం చాలా బాధాకరమని అన్నారు. ఆ ఘటనలో గాయపడిన విద్యార్థులకు, జర్నలిస్టుకు ఆమె సంఘీభావం తెలియజేశారు. లోటస్ పాండ్​లో ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో షర్మిల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.

విద్యార్థులపై దాడులు అమానుషం: షర్మిల

మార్చి 10-2011 సరిగ్గా ఇదే రోజున ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రపంచానికి అద్బుతంగా చాటి చెప్పింది మిలియన్ మార్చ్.. అని ఆమె గుర్తుచేసుకున్నారు. తెలంగాణ సిద్దాంతకర్త, తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్​ను స్మరించుకోవడం మన బాధ్యత అని వ్యాఖ్యానించారు. ఎంతో మంది ఉద్యమకారులను, కళాకారులను అందించిన జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా అని ఆమె స్పష్టం చేశారు.

వరంగల్ ఉమ్మడి జిల్లాకు కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ వచ్చేట్టు ఉందా? వరంగల్ స్మార్ట్ సిటీ అయ్యేట్టు ఉందా ? మొన్న వరదలు వచ్చాయి.. ఏమైంది? కాకతీయ యూనివర్సిటీకీ వీసీ ఉన్నారా? అని షర్మిల పలు సమస్యల గురించి ప్రశ్నించారు. శ్రీరాంసాగర్ స్టేజ్-2 పనులు 90 శాతం, దేవాదుల ప్రాజెక్టు స్టేజ్-1, స్టేజ్-2 పనులు 80 శాతం పూర్తి చేశారన్నారు. వైఎస్ బతికుంటే ఈ పనులు పూర్తయ్యేవన్నారు. ఇవన్నీ పూర్తయితే.. కేవలం వరంగల్ జిల్లాకే లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవని పేర్కొన్నారు. వైఎస్ మరణించడం.. కంతనపల్లి ప్రాజెక్టు ముందుకు వెళ్లకపోవడం బాధాకరమన్నారు. కాకతీయ థర్మల్ ప్రాజెక్టు కూడా వైఎస్ ఆలోచనే అని వెల్లడించారు.

ఇదీ చూడండి: విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు: కేటీఆర్‌

Last Updated : Mar 10, 2021, 9:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.