డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని వైఎస్ షర్మిల ప్రధాన అనుచరురాలు ఇందిరా శోభన్ పేర్కొన్నారు. అంబేడ్కర్ 130వ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రాజ్యాంగం ప్రకారం తెలంగాణ తెచ్చుకున్నా.. రాష్ట్రప్రభుత్వం ఆ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతోందని ఇందిరా శోభన్ మండిపడ్డారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌కు నివాళులర్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సమయం లేకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం కోసం మరో పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.