సునీల్ నాయక్ అంతిమయాత్రలో నిరుద్యోగులంతా పాల్గొనాలని... యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనా రెడ్డి అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్‌లు రావడం లేదని మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్న సునీల్ నాయక్ మృతి పట్ల ఆయన ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
కల్వకుంట్ల కుటుంబం కళ్లు తెరిచే వరకు నిరుద్యోగులతో కలిసి యువజన కాంగ్రెస్ ఉద్యమిస్తుందని శివసేనా రెడ్డి స్పష్టం చేశారు. గాంధీ ఆసుపత్రి నుంచి సునీల్ నాయక్ భౌతికకాయాన్ని స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా గూడూరుకు తరలింపులో భారీ ఎత్తున పాల్గొనాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: బాలికపై వీధి కుక్క దాడి.. తల్లడిల్లిన చిన్నారి