హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్స్టేషన్ ముందు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ నిరసన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శించిన కాంగ్రెస్ కార్యకర్తలు సాయిబాబా, రితిక్ను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇద్దరిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
నిన్న ప్రగతిభవన్ భద్రతా సిబ్బంది ఔట్ పోస్ట్ వద్ద ద్విచక్ర వాహనంపై రితిక్, సాయిబాబా వచ్చారు. వాహనం దిగిన సాయిబాబా కేసీఆర్ ఎక్కడంటూ ప్లేకార్డు ప్రదర్శించారు. పోలీసులు వారిని పట్టుకునే లోపు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
దర్యాప్తు చేసిన పంజాగుట్ట పోలీసులు గత రాత్రి సాయిబాబా, రితిక్ను అదుపులోకి తీసుకున్నారు. కరోనా నిబంధనలకు విరుద్ధంగా నిరసనలు చేయడమే కాకుండా పోలీసు సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారంటూ వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.