ETV Bharat / state

అర్నబ్ గోస్వామిని జైలుకు పంపండి : అనిల్​ కుమార్​ యాదవ్ - అర్నబ్ గోస్వామిని జైలుకు పంపండి : అనిల్​ కుమార్​ యాదవ్

ప్రముఖ టీవీ ఛానెల్ చీఫ్ ఎడిటర్ అర్నబ్ గోస్వామిపై యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అర్నబ్​ను అరెస్ట్ చేయాలని హైదరాబాద్ పాతబస్తీ హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్​లో అనిల్ ఫిర్యాదు ఇచ్చారు.

అర్నబ్​ భాజపా తొత్తు...అరెస్ట్ చేయండి : అనిల్

author img

By

Published : Apr 23, 2020, 11:59 AM IST

Updated : Apr 23, 2020, 1:17 PM IST

హైదరాబాద్ పాతబస్తీ హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్​లో రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నబ్ గోస్వామిపై యూత్ కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ యాదవ్ ఫిర్యాదు చేశారు. మహారాష్ట్రలోని పాల్ ఘర్​లో ఈ నెల 16న సాధుల హత్యకు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించాలంటూ అర్నబ్ చేసిన వ్యాఖ్యల్ని యూత్ కాంగ్రెస్ నేత ఖండించారు. ఈ మేరకు నిందితుడ్ని వెంటనే అరెస్ట్ చేయాలంటూ హుస్సేనీఆలం ఠాణా​లో ఫిర్యాదు ఇచ్చారు.

'అర్నబ్​ను జైలుకు పంపాలి'

'పూచ్​తా హై భారత్' ప్రోగ్రాంలో సాధుల హత్య విషయమై సోనియా ఎందుకు మౌనం వహించారనే వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో యూత్ కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. దేశంలో మత ఘర్షణలు చెలరేగే విధంగా అర్నబ్ ప్రవర్తించారని అనిల్ మండిపడ్డారు. వెంటనే నిందితుడ్ని అరెస్ట్ చేసి జైలుకు పంపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్నబ్ ఆర్​ఎస్​ఎస్​, భాజపాలకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని అనిల్ తీవ్ర స్థాయిలో ఆగ్రహించారు.

అర్నబ్​ భాజపా తొత్తు...అరెస్ట్ చేయండి : అనిల్

ఇవీ చూడండి : వైరస్​లతో నష్టాలే కాదు... లాభాలూ ఉన్నాయ్​!

Last Updated : Apr 23, 2020, 1:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.