ETV Bharat / state

డాంకీ ఫామ్‌ - చదువుకుంటూనే వ్యాపారం - గాడిద పాలు విక్రయిస్తూ లక్షల్లో ఆర్జన - Donkey Farm in Choutupal

Young Woman with Donkey Farm Business : చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగ అన్వేషణ అనేది అందరూ చేసే పనే. అందరిలా మనమూ చేస్తే అందులో కిక్కేముంది అనుకుంది ఆ యువతి. ఉద్యోగం అనే రొటీన్‌ పద్దతికి స్వస్తి చెప్పి భిన్నంగా ఆలోచించింది. నలుగురికి ఉపాధి కల్పిస్తే ఎలా ఉంటుందని భావించి వ్యాపారం వైపు అడుగులు వేసింది. అది కూడా అలాంటి ఇలాంటి వ్యాపారం కాకుండా, వినూత్నంగా డాంకీ ఫామ్ ప్రారంభించింది. గాడిద పాలు విక్రయిస్తూ రూ.లక్షల్లో ఆదాయం పొందుతోంది. చదువుకుంటూనే వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తున్న ఆ యువ వ్యాపారవేత్త సక్సెస్‌ స్టోరీ ఇది.

Young Woman Earning with Donkey Farm
Young Woman with Donkey Farm Business
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 13, 2024, 8:17 PM IST

డాంకీ ఫామ్‌తో లక్షలు సంపాదిస్తున్న యువతి - సరికొత్త ఆలోచనతో విన్నూత బిజినెస్​

Young woman with Donkey Farm Business : ఆరోగ్య పరిరక్షణలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్‌ గాడిద పాలు. మార్కెట్‌లో వీటికి ఉన్న క్రేజ్‌ను అందిపుచ్చుకుంది ఈ యువతి. ప్రజలకు ఆరోగ్యం, తనకు ఆదాయంతో నలుగురికీ ఉపాధిని కల్పించేలా గాడిద పాల ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పింది. డాంకీ ఫామ్‌ను ప్రారంభించి లక్షల్లో రాబడిని అందుకుంటోంది. చిన్న వయస్సలోనే ఉత్తమ వ్యాపారవేత్తగా రాణిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది.

గాడిదలతో సరదాగా తిరుగుతున్న ఈ యువతి పేరు భూమిక(Bhumika). యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం సింగరాయచెర్వు (Singaraya Cheruvu) గ్రామం స్వస్థలం. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌ శ్రేయాస్ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్ బీఎస్సీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. చదుకుంటూనే ఆదాయం కోసం ఏం చేయాలి, ఎక్కడ జాబ్‌ చేయాలి అనుకున్నప్పుడు మనమే సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తే ఎలా ఉంటుందని ఆలోచించింది. ఆ ఆలోచనతో గాడిదల ఫామ్‌ ప్రారంభించినట్లు చెబుతోంది భూమిక.

Donkey Milk Benefits : గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ప్రజలకు వచ్చే రకరకాల అనారోగ్య సమస్యలను గాడిద పాలు నయం చేస్తున్నాయని తెలుసుకుంది భూమిక. కరోనా సమయంలో గాడిద పాలు బాగా ఉపయోగపడ్డాయి. గాడిదల ఫామ్ ఏర్పాటు చేస్తే పాల విక్రయంతో పాటు అంతరించిపోతున్న ఆ జాతిని అభివృద్ధి చేయవచ్చు అని కూడా అనుకుంది. ఫలితంగా ప్రకృతికి, ప్రజలకు మేలు చేయడమే కాకుండా ఆదాయం అందుకోవచ్చు అని ఫామ్‌ ఏర్పాటు చేసింది.

గాడిదల పెంపకం వాటి సంరక్షణ గురించి వివిధ ప్రదేశాల్లో తిరిగి, నిపుణుల అభిప్రాయాలను తీసుకుంది భూమిక. గాడిదలు కొనుగోలు చేసింది. అనుభవం లేకపోవడంతో ఆరంభంలో సమస్యలు వచ్చాయి. అయినా ధైర్యంగా ముందడుగేసింది. తమిళనాడులోని డాంకీ ప్యాలెస్‌(Donkey Palace) గురించి తెలుసుకుని వారితో ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం 40 గాడిదలతో వ్యాపారం చేస్తున్నట్లు చెబుతోంది.

'పాలను బాటిల్స్‌లో పెట్టి కోల్డ్‌ స్టోరేజ్‌ చేస్తాం. సాధారణంగా ఈ పాలు ఏడాది పాటు నిల్వ ఉంటాయి. ఈ పాలను నెలకు ఒకసారి తమిళనాడు డాంకీ ప్యాలెస్‌కి పంపిస్తాం. లీటర్‌ ధర 16 వందల రూపాయలు ఉంది. నెలకు 600 లీటర్లు వరకు పాలను సరాఫరా చేస్తున్నాం. ఖర్చులు అన్ని పోనూ నెలకి 3 లక్షలు రూపాయల ఆదాయం అందుతుంది' - భూమిక, కనకదుర్గ డాంకీ ఫామ్‌ యజమాని

Young Woman Earning with Donkey Farm : కొత్తగా డాంకీ ఫామ్‌ ప్రారంభించాలనుకునే వారికి కూడా తగిన సలహాలు, సూచనలు ఇస్తోంది భూమిక. తన ఫాం ద్వారా పలువురికి ఉపాధి కల్పిస్తుంది. అటు వ్యాపారం పరంగా ఇటు ఆరోగ్యపరంగా నలుగురికి ఉపయోగపడుతుంటే సంతృప్తిని ఇస్తుందని అంటోంది. సామాజిక మాధ్యమాల్లోనూ(Social Media) తన ఫామ్‌కు మంచి స్పందన వస్తోందని చెబుతోంది ఈ వ్యాపారవేత్త. భూమిక డాంకీ ఫామ్‌ వ్యాపారంపై ఆమె తల్లితండ్రులు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. తమకు ముగ్గురు ఆడ పిల్లలైనా కూతుళ్ల ఆలోచనలకు అనుగుణంగానే ప్రోత్సహించారు. పెద్ద మెుత్తంలో పెట్టుబడి అవసరమైనా వెనుకాడకుండా అందించారు.

ఉద్యోగాల కోసం ఎదురుచూడటం అవి రాలేదని బాధపడటం మానేసి మనకు ఉన్న దానిలో చిన్న వ్యాపారం ప్రారంభిస్తే, పది మందికి ఉపాధి కల్పించే స్థితికి చేరుకోవచ్చని భూమిక అంటోంది. ప్రభుత్వం కూడా ఇలాంటి వినూత్న వ్యాపారాలను ప్రోత్సహించి లోన్‌, ఇన్సూరెన్స్‌(Insurance)సదుపాయం కల్పిస్తే బాగుంటుందని అంటోంది ఈ యువ వ్యాపారవేత్త.

తండ్రి బాటలో చిత్రకారిణిగా రాణిస్తున్న ప్రియాంక ఏలే - ఔరా అనిపించేలా పెయిటింగ్స్​

సంప్రదాయ పద్ధతిలో బేకరీ పదార్థాల తయారీ - ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.