ETV Bharat / state

Hyderabad girl stuck in uttarakhand floods: ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకున్న హైదరాబాద్‌ యువతి - తెలంగాణ వార్తలు

దసరా సెలవులకు ఉత్తరాఖండ్ వెళ్లిన హైదరాబాద్ యువతి... వరదల్లో(Young woman stuck in uttarakhand floods) చిక్కుకుపోయింది. తమ కూతురిని కాపాడాలని బాధితురాలి తల్లిదండ్రులు తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. దీనిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.

Hyderabad girl stuck in uttarakhand floods,  uttarakhand floods 2021
ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకున్న హైదరాబాద్‌ యువతి, ఉత్తరాఖండ్ వరదలు 2021
author img

By

Published : Oct 19, 2021, 10:42 PM IST

దసరా సెలవులకు వెళ్లి ఉత్తరాఖండ్‌లో వరదల్లో(Young woman stuck in uttarakhand floods) చిక్కుకున్న ఓ యువతిని కాపాడాలని బాధితురాలి తల్లి కోరారు. మల్కాజిగిరి ఆర్కే నగర్‌కు చెందిన సుష్మ అనే సాప్ట్‌వేర్‌ ఉద్యోగి ఆమె ఐదుగురు మిత్రులతో కలిసి ఉత్తరాఖండ్‌ వెళ్లింది. వరదలు ముంచెత్తడంతో గత నాలుగు రోజులుగా వారంతా ఓ హోటల్‌లోని మూడో అంతస్తులో చిక్కుకుపోయారు. తమ పిల్లలను కాపాడి హైదరాబాద్‌ తీసుకురావాలని బాధితురాలి తల్లిదండ్రులు తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

సుష్మ, ఆమె స్నేహితులు హోటల్​ మూడో అంతస్తులో చిక్కుకుపోయారని... రెండో అంతస్తు వరకు నీళ్లు చేరడంతో బయటకు రాలేని పరిస్థితి(Young woman stuck in uttarakhand floods) ఏర్పడిందని బాధితురాలి తల్లి తెలిపారు. వారు మల్కాజిగిరి స్థానిక నేతలను కలిసి సాయం కోరారు. ఈ విషయాన్ని తెలంగాణ సీఎంవోకు మెసేజ్ చేశామని అన్నారు.

కేంద్రమంత్రి స్పందన

మల్కాజిగిరి రాధాకృష్ణ నగర్‌ వెల్ఫేర్‌ అసోషియేషన్ చేసిన ట్వీట్‌కు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కార్యాలయం స్పందించింది. హైదరాబాద్‌ నుంచి ఉత్తరాఖండ్‌ విహార యాత్రకి వెళ్లిన సుష్మ, తన స్నేహితులు భారీ వర్షాలు, వరదల కారణంగా ఓ హోటల్‌ మూడో అంతస్తులో చిక్కుకుపోయారు. వారిని కాపాడాలని కాలనీవాసులు ట్వీట్‌ చేశారు. దీనిపై స్పందించిన కిషన్‌ రెడ్డి కార్యాలయం... ఉత్తరాఖండ్‌లో అధికారులకు ఈ విషయాన్ని చేరవేశారు. సత్వరమే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వరదల్లో చిక్కుకున్న వారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి సైతం స్వయంగా బాధితులతో మాట్లాడారు. త్వరగా స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తామని భరోసా ఇచ్చారు.

ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకున్న హైదరాబాద్‌ యువతి

ఇదీ చదవండి: chigurupati jayaram murder case: చిగురుపాటి జయరామ్ హత్య కేసులో బెదిరింపులు.. ముగ్గురు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.