Housewife Missing in Hyderabad Today : బంధాలపై విరక్తి చెందిన ఆ మహిళ.. చాలా రోజులుగా మానసికంగా కుంగిపోతుంది. దేవుడు వేసిన బంధాలను ఆమె సంకెళ్లుగా భావించింది. భర్త పంచిన ప్రేమ.. అమ్మానాన్నల నుంచి లభిస్తున్న ఆదరణ ఆమెను ఆ భావన నుంచి బయటపడేయలేకపోయాయి. చివరకు తన ఐదేళ్ల పాపను కూడా వద్దనుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. 'బంధాల బంధం తెంచుకొని బతకాలని ఉంది.. నా బతుకు నేను బతుకుతా' అంటూ ఓ ఆడియో సందేశం పంపి ఓ గృహిణి అదృశ్యమైన ఘటన హైదరాబాద్‌లోని బోరబండ పరిధిలో చోటుచేసుకంది.
- 'ఇక పరిగెత్తే ఓపిక లేదు నాన్నా.. దయచేసి మా కోసం వెతకొద్దు'
- దమ్మాయిగూడలో అదృశ్యమైన బాలిక.. చెరువులో శవమై..
Housewife Missing News Today : పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ పరిధిలోని రాజనగర్‌కు చెందిన పాల లక్ష్మణ కుమార్ ఏడేళ్ల క్రితం అశ్విని అనే ఆమెను పెళ్లి చేసుకున్నారు. వీరికి ప్రస్తుతం ఓ ఐదేళ్ల పాప కూడా ఉంది. అశ్విని ఓ వస్త్ర షోరూంలో పని చేస్తుంది. గత కొంతకాలంగా తనకు స్వతంత్రంగా బతకాలని ఉందని.. తాను వెళ్లిపోతానంటూ భర్త లక్ష్మణ్‌తో గొడవ పడేది. ఈ క్రమంలో తరచూ పుట్టింటికి వెళ్లి వస్తుండేది. గత నెల 31వ తేదీన యధావిధిగా డ్యూటీకి వెళ్లొస్తానని ఇంటి నుంచి వెళ్లిన అశ్విని తిరిగి రాలేదు.
తండ్రి సెల్‌ఫోన్‌కు ఆడియో మెసేజ్ : రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో ఇంటి దగ్గర వాళ్లు కంగారుపడ్డారు. పని చేసే చోటికి వెళ్లి ఆరా తీస్తే నెల రోజులు సెలవు పెట్టినట్లు చెప్పారు. దీంతో దగ్గర వాళ్లకు, తెలిసిన వారికి ఫోన్ చేశారు. అయినా ఎక్కడా ఆచూకీ లభించలేదు. ఇంతలో అశ్విని నుంచి తన తండ్రికి ఓ వాట్సప్ ఆడియో మెసేజ్ వచ్చింది. అందులో 'బంధాల బంధం తెంచుకుని స్వతంత్రంగా బతకాలని ఉందని. నా బతుకు నేను బతుకుతా' అంటూ చెప్పుకొచ్చింది. వెంటనే ఫోన్ చేసే స్పిచ్ఛాఫ్ వచ్చింది.
ఈ సందేశాన్ని తన అల్లుడికి వినిపించాడు. దీంతో లక్ష్మణ్ కుమార్ ఏం చేయాలో తెలియక శుక్రవారం బోరబండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్య ఆచూకీ కనుగొనాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఆమె జీవితంపై అంతలా విరక్తి చెందడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఆమె పని చేసే చోట ఎవరితోనై స్నేహ సంబంధాలు ఉన్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయిన ముందు రోజు ఇంట్లో పరిస్థితి ఏంటి అనే దాని గురించి భర్తను అడిగి తెలుసుకున్నారు. ఆమె సెల్‌ఫోన్ కాల్‌డేటా ఆధారంగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: