ఒకరితో నిశ్చితార్థం... మరొకరితో పెళ్లి... సీఎం కాన్వాయ్ డ్రైవర్ కానిస్టేబుల్ శశికుమార్ బాగోతం ఇది. న్యాయం కోసం బాధిత కుటుంబం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది(Complaint on Constable). హైదరాబాద్ జియాగూడకు చెందిన బీటెక్ పూర్తి చేసిన యువతితో... వనపర్తి జిల్లా పెద్దమందడి గ్రామానికి చెందిన వాకిటి శశికుమార్ నిశ్చితార్థం అయింది. కానీ ఆయన వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నారని బాధితురాలు పేర్కొంది.
అదనపు కట్నం కోసం
సీఎం కేసీఆర్(cm kcr) కాన్వాయ్ డ్రైవర్‌గా కానిస్టేబుల్ శశికుమార్ పనిచేస్తున్నట్లు బాధితురాలు తెలిపింది. 2019 నవంబర్‌లో ఎంగేజ్మెంట్ జరిగిందని వెల్లడించింది. మొదట రూ.5 లక్షలు కట్నం ఒప్పందం చేసుకున్నారని... నిశ్చితార్థం అనంతరం రూ.10 లక్షల కట్నం, 20 తులాల బంగారం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని శశి కుమార్ డిమాండ్ చేసినట్లు కమిషన్‌కు బాధితురాలు వివరించింది. శశికుమార్ ఆగస్టు 26న మరో అమ్మాయిని వివాహం చేసుకున్నారని... నిశ్చితార్థం తర్వాత తనకు అన్యాయం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
పట్టించుకోవడం లేదు
శశికుమార్‌పై ఇప్పటికే కులసంపుర, పెద్ద మందడి, నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినా... పోలీసులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించానని తెలిపింది. రెండేళ్లుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నానని వాపోయింది.
వాకిటి శశికుమార్ అనే అబ్బాయితో నవంబర్ 22, 2019లో నాకు ఎంగేజ్మెంట్ జరిగింది. అతను సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్నారు. నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అతడు వేరే పెళ్లి చేసుకున్నారు. నిశ్చితార్థం తర్వాత వాళ్ల పేరెంట్స్ అదనపు కట్నం డిమాండ్ చేశారు. డిపార్టుమెంటు అనే ధైర్యంతో ఇలా చేశారు. మేం ఎక్కడ ఫిర్యాదు చేసినా తీసుకోవడం లేదు. వాళ్ల ఇన్ఫ్లూయెన్స్ వాడుకుంటున్నారు. సీఎం క్యాంపు(cm camp office) ఆఫీసు నుంచి కాల్ చేసి... కేసు తీసుకోవద్దని బెదిరిస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు పంచాయితీ పెట్టించాం. మాకు ఎక్కడా న్యాయం జరగడం లేదు. అందుకే హెచ్చార్సీని(hrc) ఆశ్రయించాం.
-బాధితురాలు
ఇదీ చదవండి: Tollywood Drugs Case: డ్రగ్స్ కేసులో రకుల్‌ప్రీత్ సింగ్‌ను 6గంటల పాటు ప్రశ్నించిన ఈడీ