Champions Trophy Varun Chakravarthy : సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్ ఓడినప్పటికీ యంగ్ స్పిన్నర్ వరున్ చక్రవర్తి ఆద్భుత ప్రదర్శన కనబర్చాడు. ప్రత్యర్థి బ్యాటర్లనూ బెంబేలెత్తిస్తూ ఏకంగా 5 వికెట్లు దక్కించుకున్నాడు. కాగా, ఇదే సిరీస్ తొలి మ్యాచ్‌లోనూ వరుణ్ ఆకట్టుకున్నాడు. ఆ మ్యాచ్‌లో 3 వికెట్లతో రాణించాడు. దీంతో ప్రస్తుత సిరీస్‌లోనే రెండు మ్యాచ్‌ల్లో 8 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.
ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వరుణ్ లాంటి టాలెంటెడ్ ప్లేయర్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు. ఒకవేళ 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ జరిగితే ఈ టోర్నీలో వరుణ్‌కు టీమ్ఇండియాలో కచ్చితంగా చోటు కల్పించాలని పేర్కొన్నాడు. ఒకవేళ టీమ్ఇండియా అలా చేయకపోతే అది పెద్ద తప్పిదంగా మారే ఛాన్స్ ఉందని తెలిపాడు.
'2025 ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో క్లారిటీ లేదు. అయితే అది మన చేతుల్లో లేని అంశం. కానీ, ఒకవేళ ఈ టోర్నీ జరిగితే మాత్రం భారత్ తప్పకుండా పాల్గొంటుంది. అప్పుడు వరుణ్ చక్రవర్తి వంటి మిస్టరీ స్పిన్నర్‌కు జట్టులో స్థానం ఇవ్వాలి. లేకపోతే అది టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ చేసిన ఘోర తప్పిదం అవుతుంది' అని దినేశ్ కార్తిక్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు.
If india don't pick VARUN CHAKRAVARTHY for the Champions Trophy , then they are making a grave error
— DK (@DineshKarthik) November 10, 2024
Outstanding Bowler he is turning out to be #INDvSA #CricketTwitter #Cricket
ఛాంపియన్స్ ట్రోఫీ క్యాన్సిల్!
అయితే ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుంది. దీంతో టీమ్ఇండియా ప్లేయర్లను పాకిస్థాన్ పంపేందుకు బీసీసీఐ సిద్ధంగా లేదని స్పష్టం చేసింది. ఈ విషయంపై ఇప్పటికే ఐసీసీ, పీసీబీకి కూడా బీసీసీఐ క్లారిటీ ఇచ్చేసింది. మరోవైపు హైబ్రిడ్ మోడల్‌పై వస్తున్న ప్రతిపాదనలను పీసీబీ తిరస్కరించినట్లు సమాచారం. దీంతో టోర్నీ నిర్వాహణ రద్దు చేస్తేనే మంచిదని ఐసీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ, దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. కాగా, ముందుగా పీసీబీ ప్రతిపాదించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి చివరి వారంలో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కావాల్సి ఉంది.
4⃣ Overs
— BCCI (@BCCI) November 10, 2024
1⃣7⃣ Runs
5⃣ Wickets
Varun Chakaravarthy was an absolute rage today! 👌👌
Live ▶️ https://t.co/ojROEpNnzy #TeamIndia | #SAvIND pic.twitter.com/QJ6H5uZWYg
ఇక మ్యాచ్ విషయానికొస్తే, సౌతాఫ్రికా 3 వికెట్ల తేడాతో నెగ్గింది. భారత్ నిర్దేశించిన 125 స్వల్ప లక్ష్యాన్ని సఫారీ జట్టు 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో నాలుగు టీ20ల సిరీస్ 1-1తో సమం అయ్యింది.
భారత్ జోరుకు బ్రేక్- లో స్కోరింగ్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా విన్
సిక్సర్‌గా స్టేడియం దాటిన బంతి - జేబులో పెట్టుకుని పరారైన వ్యక్తి!