ETV Bharat / state

భారత్‌, తైవాన్‌ కలిస్తే ప్రపంచస్థాయి ఉత్పత్తులు : కేటీఆర్ - టీ వర్క్స్‌ను ప్రారంభించిన యంగ్ లియూ

T Works In Hyderabad: భారత్‌, తైవాన్‌ కలిస్తే.. ప్రపంచ స్థాయి ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని.. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఆకాంక్షించారు. ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ ఫాక్స్‌కాన్‌ ఛైర్మన్‌ యంగ్‌ లియూతో కలిసి హైదరాబాద్‌లో టీ-వర్క్స్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. సాఫ్ట్‌వేర్‌లో భారత్‌... హార్డ్‌వేర్‌లో తైవాన్‌ సత్తా చాటుతున్నాయంటూ.. కేటీఆర్‌ గుర్తు చేశారు.

t works
t works
author img

By

Published : Mar 3, 2023, 7:15 AM IST

Updated : Mar 3, 2023, 11:38 AM IST

భారత్‌, తైవాన్‌ కలిస్తే ప్రపంచస్థాయి ఉత్పత్తులు : కేటీఆర్

Young Liu, KTR Started T Works In Hyderabad: హైదరాబాద్‌ మహానగరానికి మరో మణిహారం వచ్చి చేరింది. ఇప్పటి వరకు సాఫ్ట్‌వేర్‌లోనే సత్తా చాటుతున్న భాగ్యనగరం.. ఇకపై హార్డ్‌వేర్‌లోనూ రాణించనుంది. ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌ ఛైర్మన్‌ యంగ్‌ లియూతో కలిసి.. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కె.తారకరామారావు టీ-వర్క్స్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు.

గ్రామీణ ఆవిష్కర్తల భాగస్వామ్యంతో టీ-హబ్‌ ఇప్పటికే వెంటిలేటర్, విద్యుత్‌ వాహనాలు, వ్యవసాయ పరికరాలను రూపొందించిందని కేటీఆర్‌ తెలిపారు. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మాత్రమే కాదని ఛమత్కరించారు. ఐ అంటే ఇండియా, టీ అంటే తైవాన్‌ అని పేర్కొన్నారు. ఇండియా సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులకు హబ్‌.. తైవాన్‌ హార్డ్‌వేర్‌ రంగంలో అగ్రగామి ఉందన్న కేటీఆర్‌.. ఈ రెండు నైపుణ్యాల మేళవింపుతో.. యువత ప్రపంచస్థాయి ఉత్పత్తులు తయారు చేసేందుకు అవకాశముందన్నారు.

టీ-వర్క్స్‌తో భాగస్వామ్యం కోరుకుంటున్నామని ఫాక్స్‌కాన్‌ ఛైర్మన్‌ యంగ్‌ లియూ తెలిపారు. హైఎండ్‌ ఎలక్ట్రానిక్‌ సర్క్యూట్‌ బోర్డులను అసెంబ్లింగ్‌ చేయడానికి ఉపయోగించే ఎస్‌ఎంటీ.. సర్ఫేస్‌ మౌంట్‌ టెక్నాలజీ లైన్‌ను విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. టీ-వర్క్స్‌ మంచి ఆలోచన అన్న యంగ్‌ లియూ.. ప్రపంచస్థాయి సదుపాయాలతో వేగంగా నిర్మించారని కితాబిచ్చారు.

T Works In Hyderabad: తెలంగాణలో పెట్టుబడుల కోసం రెండు ప్రాంతాల్ని పరిశీలించానని.. ఇక్కడి హోటల్‌ నుంచి చూసి ఇది ఇండియానేనా..? అని ఆశ్చర్యపోయానన్నారు. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందిందని.. హైటెక్‌ ఇండస్ట్రీలో వేగంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఫాక్స్‌కాన్‌ ఛైర్మన్‌ పేర్కొన్నారు. ఇక్కడి వేగాన్ని చూస్తుంటే వచ్చే నాలుగేళ్లలో.. ఫాక్స్‌కాన్‌ రెవెన్యూను రెండింతలు చేయాలన్న లక్ష్యం పెట్టుకున్నానని లియూ తెలిపారు.

దేశంలోకి వచ్చిన అతిపెద్ద ఎలక్ట్రానిక్‌ రంగంలో పెట్టుబడుల్లో ఇదే ప్రధానమైనదని ప్రభుత్వం పేర్కొంది. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ప్రగతి భవన్‌లో ఫాక్స్‌కాన్‌ ఛైర్మన్‌ యంగ్‌ లియూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఫాక్స్‌కాన్‌కు మధ్య ఒప్పందం జరిగింది. దేశంలో ఫాక్స్‌కాన్‌ ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమను నెలకొల్పేందుకు తెలంగాణనే అనువైన ప్రాంతం అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

Foxconn Chairman Young Liu Started T Works: ఈ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కంపెనీ రావడం రాష్ట్రంలో పెట్టుబడులను శుభసూచకం అని అన్నారు. ఈ సంస్థ ద్వారా దాదాపు లక్ష మందికి ఉద్యోగాల కల్పన చేసేందుకు వీలుంది. స్థానికంగా ఉండే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మొండుగా ఉన్నాయి. అనంతరం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ మధ్యాహ్నం ఫాక్స్‌కాన్‌ ప్రతినిధి బృందానికి విందు ఏర్పాటు చేశారు.

"ఫాక్స్‌కాన్‌తో సుదీర్ఘకాల భాగస్వామ్యం కొనసాగించాలని చూస్తున్నాము. హైదరాబాద్‌లో ఫాక్స్‌కాన్‌ ఎదుగుదలను కోరుకుంటున్నాము. షెన్‌జెన్‌లో మీరు ఏం చేశారో, చైనా ఏం చేసి చూపించారో.. అదే హైదరాబాద్‌లో కూడా చేసి నిరూపిస్తారని కోరుకుంటున్నాను. హైదరాబాద్‌ను భారతదేశ షెన్‌జెన్‌గా మారుస్తారని ఆశిస్తున్నాను." -కేటీఆర్‌, ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి

ఇవీ చదవండి:

Last Updated : Mar 3, 2023, 11:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.