ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని సైదాపురానికి చెందిన వెంకటరమణ కుమార్తె పుష్పాంజలి బి. పార్మసీ చదువుతోంది. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా పుష్పాంజలి ఇంట్లోనే ఉంది. గ్రామంలో ఉన్న నగేష్, కేశవ, నాగేశ్వరమ్మ... పుష్పాంజలితో గొడవ పడి దుర్భాషలాడారు. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు.. ఫ్యానుకు వేలాడుతున్న కుమార్తెను చూసి గుండెలు పగిలెలా ఏడ్చారు. తమ బిడ్డ చావుకు కారణమైన వారిని శిక్షించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: నవంబర్ 15 నుంచి రామగుండంలో 'కిసాన్ బ్రాండ్' యూరియా