ETV Bharat / state

కుమార్తెను వ్యభిచారం చేయాలంటూ తల్లి ఒత్తిడి - కరీంనగర్ జిల్లా

కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లి.. కుమార్తెను వ్యభిచారం చేయాలంటూ బలవంతం చేసింది. చదువుకోసం హైదరాబాద్ వెళ్లినా వేధించండం ఆపలేదు. చివరికి ఓపిక నశించిన కుమార్తె తల్లిపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించింది.

కుమార్తెను వ్యభిచారం చేయాలంటూ తల్లి ఒత్తిడి
author img

By

Published : Aug 2, 2019, 8:35 PM IST

వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి చేస్తున్న కన్న తల్లిపై చర్యలు తీసుకోవాలంటూ ఓ కూతురు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించింది. ఆరేళ్ల క్రితం తన తండ్రి మరణించిన అనంతరం తల్లి ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు తెలిపింది. కరీంనగర్ జిల్లా వేములవాడకు చెందిన బాధిత యువతి హైకోర్టు న్యాయవాది సయ్యద్ సలీంతో కలిసి హెచ్చార్సీలో ఫిర్యాదు చేసింది.

తన అక్క , చెల్లెల్లను తల్లి బలవంతంగా వ్యభిచార కూపంలోకి దించిందని ఆవేదన వ్యక్తం చేసింది. తాను చదువుకోవాలనే ఉద్దేశంతో తల్లివద్ద నుంచి దూరంగా హైదరాబాద్​లో తన బాబాయ్ వద్ద ఉంటున్నానని పేర్కొంది. లా చదవాలనే తపనతో నగరానికి వచ్చి చదువుతుంటే, తల్లి అక్రమంగా బాబాయ్​పై కిడ్నాప్ కేసు పెట్టి వేధిస్తున్నారంటూ వివరించింది. వ్యభిచారం చేయలంటూ బలవంతం చేస్తూ, తన బాబాయ్​పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న తల్లిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలు కమిషన్​ను వేడుకుంది.

కుమార్తెను వ్యభిచారం చేయాలంటూ తల్లి ఒత్తిడి

ఇదీ చూడండి : 'ఇప్పటికీ హెరిటేజ్ కమిటీ ఏర్పాటు కాలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.