ETV Bharat / state

ఈ అనవసర ఫీచర్స్ వదిలేస్తే - తక్కువ ధరల్లోనే సూపర్ కార్లు!

Unnecessary Features in a car : "కారు" క్రమంగా సౌకర్యాల జాబితా నుంచి.. అవసరాల లిస్టులోకి వచ్చేస్తోంది! దీంతో.. "చిన్నదో పెద్దదో.. కొత్తదో పాతదో.. మనకూ ఓ కారు కావాలి" అని కోరుకుంటోంది సగటు ఫ్యామిలీ. అయితే.. పిండికొద్ది రొట్టె అన్నట్టుగా డబ్బు కొద్దీ కార్లు లభిస్తున్నాయి. కాస్త లగ్జరీగా ఉండాలంటే.. దండిగానే సమర్పించుకోవాల్సి వస్తోంది. అయితే.. అంతగా అవసరం లేని ఫీచర్లతో ధర మరింత పెరుగుతోందని.. అవి లేకుండా చూసుకుంటే తక్కువ ధరలోనే సూపర్ కార్లు సొంతం చేసుకోవచ్చని అంటున్నారు ఆటోమొబైల్ నిపుణులు! మరి.. అవేంటో చూద్దామా!

Unnecessary Features in a car
Unnecessary Features in a car
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 7, 2024, 5:10 PM IST

Unnecessary Features in a car : ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్న కార్లలో.. కొన్ని అనవసరమైన ఫీచర్లు ఉంటున్నాయని, తక్కువ ధరకు కారు కొనుగోలు చేయాలని భావించే వారు వాటిని వదులుకుంటే చాలా డబ్బు ఆదా అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు! మరి.. అవేంటి? అవి అవసరం లేదని ఎలా చెప్తున్నారు? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

సన్‌రూఫ్ : గతంలో ఖరీదైన కార్లలో మాత్రమే Panoramic Sunroof ఉండేది. కానీ.. ఇప్పుడు సెడాన్, హ్యాచ్ బ్యాక్​లలో కూడా ఉంటోంది. అయితే.. ఇది కూడా ఇండియాలో అవసరం లేదని చెప్తున్నారు. డే టైమ్‌లో మన కారులో లైటింగ్ చక్కగా ఉంటుంది. సూర్యుడి నుంచి వచ్చే వెలుగే సరిపోతుంది. నైట్ టైమ్​ ఎలాగో లైట్స్ ఆన్‌ చేసుకుంటాం. కాబట్టి.. ఇది అనవసరమైన ఫీచరే అన్నది నిపుణుల మాట.

LED రన్నింగ్ లైట్స్: లేటెస్ట్​ వెర్షన్‌ కార్లలో.. LED లైట్లు అమరుస్తున్నారు. వీటితో లుక్‌ సూపర్​గా ఉంటుంది. పొగ మంచులో రోడ్డు మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఫాగ్‌ లైట్‌ ఫీచర్‌ కూడా ఇందుకోసమే. అయితే.. మన దేశంలోని వెదర్​కు ఇవి అంతగా అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. రోడ్లపై పొగ మంచు సమస్య మన వద్ద ఎప్పుడో తప్ప పెద్దగా ఉండదు. కాబట్టి.. ధర తక్కువలో కారు కొనాలనేవారు ఈ ఫీచర్‌ కూడా వదులుకోవచ్చు.

వైర్‌లెస్ ఛార్జర్ : ఇంట్లోనే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునే ఛాన్స్ ఉంది. అందరూ అలాగే చేస్తారు. ఒకవేళ కుదరలేదు అనుకుంటే.. కారులో కూడా కేబుల్ కనెక్ట్ చేసుకొని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అయితే.. ఇప్పుడు వైర్ లెస్ ఛార్జర్ అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ అంటున్నారు. ఫోన్​ను వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్​పై పెట్టాల్సి ఉంటుంది. అంటే.. పొయ్యి మీద పెనం పెట్టి దాంట్లో గింజలు వేయించడం లాగా అన్నమాట! దీనివల్ల చాలా వేడి ప్రొడ్యూస్ అవుతుంది. ఫోన్‌ దెబ్బతినే ఛాన్సూ ఉంది. ఇలాంటి ఫీచర్​కు అదనంగా డబ్బు చెల్లించాలి. కాబట్టి.. దీన్ని వదులుకుంటేనే మంచిదని సూచిస్తున్నారు.

టచ్‌ప్యాడ్ : లేటెస్ట్​ కార్లలో టచ్‌ప్యాడ్‌ కంట్రోల్‌ ఉంటోంది. ఇది నిజంగానే ఆకర్షణీయంగా ఉంటోంది. అయితే.. దీనివల్ల నష్టాలు కూడా ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలు కూడా జరగొచ్చు. అనుకోకుండా.. టచ్‌ప్యాడ్‌లో ఒక బటన్ బదులు మరొక బటన్‌ ప్రెస్‌ చేసే ఛాన్స్ ఉంది. అందువల్ల పాత పద్ధతిలోని బటన్స్ ఉన్న కార్లు తీసుకుంటేనే మంచిదని అంటున్నారు. పైగా.. ధర కూడా తగ్గుతుంది.

ఆటోమేటిక్‌ వైపర్: వర్షంలో జర్నీ చేయాల్సి వస్తే.. డ్రైవర్ వైపర్ ఆన్​ చేస్తారు. ఇందుకోసం ఓ బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఈ పనికూడా చేత్తో చేయకుండా ఆటోమేటిక్ వైపర్ ఆప్షన్​ ఉంటోంది. దీనికి కూడా అదనంగా డబ్బు చెల్లించాల్సిందే. కాబట్టి.. ఈ ఆప్షన్​ కూడా అనవసరమే అన్నది మెజారిటీ మాట.

అయితే.. ఇవన్నీ చాలా మంది కోరుకోవచ్చు. అది వ్యక్తిగతం. డబ్బులకు ఇబ్బంది లేకపోతే.. ఈ ఫీచర్స్ అన్నీ ఉండే కార్లను కొనుగోలు చేయొచ్చు. కానీ.. డబ్బుకు కాస్త ఇబ్బందిగా ఉన్నవారు ఇలాంటి అదనపు ఫీచర్లను వదులుకోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల.. తక్కువ ధరకే మంచి కారు మీ సొంతం అవుతుందని అంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.