YCP Youth Leader Sensational Comments: వైసీపీ ఆంధ్రప్రదేశ్ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి షేక్ మీరావలి సంచలన విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలను పక్కనపెడితే.. 'రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావాల్సింది చంద్రబాబే' అంటూ షేక్ మీరావలి ఓ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇంకా ఆ వీడియోలో పలు కీలక విషయాలను ఆయన వెల్లడించారు.
-
"రాజకీయాలు పక్కనబెడితే రాష్ట్రానికి కావాల్సింది @ncbn గారే. ఆయనతోనే అమరావతి అభివృద్ధి చెందుతుంది." ఈ మాట అన్నది వైసీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి షేక్ మీరావలి. ఆశ్చర్యంగా ఉంది కదా! అందుకే ఈ సెల్ఫీ వీడియో తెగ వైరల్ అవుతోంది. మీరూ చూడండి.#TDPforDevelopment#NCBN pic.twitter.com/SxSl9WukZp
— Telugu Desam Party (@JaiTDP) February 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">"రాజకీయాలు పక్కనబెడితే రాష్ట్రానికి కావాల్సింది @ncbn గారే. ఆయనతోనే అమరావతి అభివృద్ధి చెందుతుంది." ఈ మాట అన్నది వైసీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి షేక్ మీరావలి. ఆశ్చర్యంగా ఉంది కదా! అందుకే ఈ సెల్ఫీ వీడియో తెగ వైరల్ అవుతోంది. మీరూ చూడండి.#TDPforDevelopment#NCBN pic.twitter.com/SxSl9WukZp
— Telugu Desam Party (@JaiTDP) February 4, 2023"రాజకీయాలు పక్కనబెడితే రాష్ట్రానికి కావాల్సింది @ncbn గారే. ఆయనతోనే అమరావతి అభివృద్ధి చెందుతుంది." ఈ మాట అన్నది వైసీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి షేక్ మీరావలి. ఆశ్చర్యంగా ఉంది కదా! అందుకే ఈ సెల్ఫీ వీడియో తెగ వైరల్ అవుతోంది. మీరూ చూడండి.#TDPforDevelopment#NCBN pic.twitter.com/SxSl9WukZp
— Telugu Desam Party (@JaiTDP) February 4, 2023
''ఈరోజు నేను ఈ ఇండిగో విమానంలో ప్రయాణం చేస్తున్నా. నాతోపాటు మన ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాత నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. చాలామంది చెప్తారు ఆయన చార్టర్ ప్లైట్‌లో వెళ్తారు.. రాజధాని కోసం వెచ్చించిన డబ్బులను ఖర్చు చేస్తారని.. అది తప్పు. నేను వైసీపీకి చెందిన వ్యక్తిని.. అది కాదు ముఖ్యం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ది ముఖ్యమని బాబుగారు నాతో అన్నారు. సార్ మీరు చేస్తున్న ఈ సేవ చాలా ఆనందదాయకమైంది. రాజకీయాలు పక్కనబెడితే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావాల్సింది చంద్రబాబే'' - వీడియోలో షేక్ మీరావలి
షేక్ మీరావలి.. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన వైసీపీలో క్రియాశీల నాయకుడు. శుక్రవారం రాత్రి గన్నవరం నుంచి హైదరాబాదుకు వెళ్లే విమానంలో ఆయన ప్రయాణించారు. తన పక్క సీట్లో ఉన్న చంద్రబాబు నాయుడుతో కలిసి అతను ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో కలిసి ఉన్న సెల్ఫీ వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మీరావలి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌గా మారాయి.
ఇవీ చదవండి..
"గుర్తుపెట్టుకో సజ్జల.. నాకు ఆడియో కాల్స్ వస్తే.. మీకు వీడియో కాల్సే.."