YSRCP leaders violated section 144: ప్రతిపక్షాలు ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా నిరసనలు, ర్యాలీలు, రోడ్డు షోలు చేస్తే క్షణాల్లో వాలిపోయి అనుమతులు లేవని అడ్డగించే పోలీసులు.. 144 సెక్షన్ అమలులో ఉండగా.. అదీ పోలీసు కానిస్టేబుల్ పరీక్షలు జరుగుతుండగా.. వైసీపీ నేతలు బైక్ ర్యాలీలు నిర్వహిస్తే మాత్రం ఆ ప్రాంతంలో కనబడటం కాదు కదా.. అసలు తాము ఏమీ చూడనట్లుగా వ్యవహరించిన తీరు ఇప్పడు చర్చనీయాంశంగా మరింది. వైసీపీ నేత మార్కెట్ యార్డ్ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ సభలు పెట్టడంపై పరీక్షలు రాసే విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. పైగా పెద్ద పెద్ద మైక్‌లు పెట్టి సీఎం జగన్ పాటలతో హోరెత్తించారు. ఇలాంటి ఘటనలకు పోలీసుల అనుమతులు అవసరం లేదా అంటు ప్రతిపక్ష నేతలు, ప్రజలు మండిపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో గుత్తి పట్టణాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంది. అయితే 144 సెక్షన్ అమలును అతిక్రమించి వైసీపీ నేతలు నేడు గుత్తి మార్కెట్ యార్డ్ ఛైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గుత్తి పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. గుత్తి గాంధీ చౌక్ వద్ద నుంచి శ్రీ సాయి డిగ్రీ కాలేజ్ సమీపంలో ఉన్న మార్కెట్ యార్డ్ వద్దకు బైక్ ర్యాలీగా వెళ్లారు. అనంతరం శ్రీ సాయి డిగ్రీ కళాశాలకు కానిస్టేబుల్ పరీక్షా కేంద్రానికి కూతవేటు దూరంలోనే మార్కెట్ యార్డు ఛైర్మన్ ప్రమాణ స్వీకార సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సభా ప్రాంగణం పరీక్షా కేంద్రానికి దగ్గరలో ఉండటంతో భారీ శబ్దాలతో జగనన్నకు సంబంధించిన పాటలతో దద్దరిల్లిలాయి. పాటలు పెట్టడంతో డిగ్రీ కాలేజ్ పరీక్ష కేంద్రంలో పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు ఇబ్బంది కలిగింది. గుత్తిలో 144 సెక్షన్ అమలులో ఉండగా ప్రమాణ స్వీకారం మహోత్సవ సభకు, బైక్ ర్యాలీకి పోలీసులు ఏ విధంగా పర్మిషన్లు ఇచ్చారన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రం సమీపంలో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం కానిస్టేబుల్ పరీక్ష జరుగుతున్న సమయంలో ఇలా చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: