YCP LEADER SUICIDE ATTEMPT : ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్‌కు సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ తగిలింది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా ఎమ్మెల్సీ ఇక్బాల్.. చిలమత్తూరు మండలంలోని తుమ్మలగుంటకు వచ్చారు. అయితే, తమ గ్రామానికి రావొద్దంటూ వైసీపీ నాయకుడు, ఎంపీటీసీ నాగమణి భర్త నాగరాజు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. తమకు ప్రాధాన్యత ఇవ్వకుండా గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించడమేంటని నిలదీశారు. దీంతో పోలీసులు వెంటనే నాగరాజును నిలువరించారు. మరోవైపు తమ నాయకుడు ఆత్మహత్యాయత్నం చేసినా.. తనకేం పట్టనట్టు ఎమ్మెల్సీ కార్యక్రమాలు నిర్వహించడం తగదంటూ పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: