RYTHUBANDHU: తెలంగాణ రైతులకు శుభవార్త. ఈ ఏడాది తాజా యాసంగి సీజన్‌కు సంబంధించి పెట్టుబడి సాయం కింద రైతులకు ఇస్తున్న పదో విడత రైతుబంధు నగదును బ్యాంకు అకౌంట్లలో జమ చేసింది. ఈరోజు నుంచి ప్రారంభమయ్యే 10వ విడత రైతుబంధు ద్వారా ఈ యాసంగి సీజన్‌లో 70.54 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. తొలి రోజున 1 ఎకరం వరకు ఉన్న 21,02,822 మంది రైతులకు ఇప్పటికే వారి అకౌంట్‌లలో రూ.607.32కోట్లు జమ చేసినట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.
ఇవీ చదవండి: