పేదలకు అన్యాయం చేస్తున్న సీఎం ప్రజలకు దెయ్యంలా కనిపిస్తున్నారని భాజపా మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపాధ్యక్షుడు యండల లక్ష్మీనారాయణ విమర్శించారు. కొందరు ప్రజాప్రతినిధులు కేసీఆర్కు భజన చేస్తున్నారని అన్నారు. వారి మాటలతో బీసీల ఆత్మగౌరవం దెబ్బతింటుందన్నారు. కాగితం మీదనే ఎంబీసీలకు వెయ్యి కోట్లు ఇచ్చారని...ఆ నిధులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు.
ఆసుపత్రులకు ఇచ్చే ఆరోగ్యశ్రీ బిల్లులు రూ.600 కోట్లు బకాయిలు పెట్టారని... సచివాలయం నిర్మాణానికి రూ.500కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ రాకుండా అడ్డుకున్నారన్నారు. పదవీ విరమణ పొందిన వారిని కొనసాగిస్తూ... కొత్తవారికి అవకాశం ఇవ్వడం లేదన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని దేవుడితో పోల్చి ప్రజలను అవమాన పరచవద్దని లక్ష్మీ నారాయణ హితవు పలికారు.
ఇదీ చూడండి: