ETV Bharat / state

చంద్రగ్రహణం సందర్భంగా రేపు యాదాద్రి ఆలయం మూసివేత - Lunar eclipse 2022

Yadadri temple closed on occasion of lunar eclipse tomorrow: మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా రాష్ట్రంలో ఆలయాలను మూసివేయనున్నారు. యాదాద్రి ఆలయానికి ఉదయం కైంకర్యాల అనంతరం తాళం వేయనున్నారు. మరలా తిరిగి మరుసటిరోజు ఉదయం నుంచి భక్తులను దర్శనాలను అనుమతించనున్నారు. గ్రహణం సందర్భంగా అన్ని సేవలను రద్దు చేశారు.

lunar eclipse in telangana
చంద్రగ్రహణం
author img

By

Published : Nov 7, 2022, 10:29 PM IST

Yadadri temple closed on occasion of lunar eclipse tomorrow: చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ లక్ష్మీనరసింహ ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు నల్లందిగల్​ లక్ష్మీనరసింహ చార్యులు తెలిపారు. ఉదయం మూడు గంటలకు ఆలయాన్ని తెరిచి నిత్య కైంకర్యములు నిర్వహిస్తామన్నారు. ఈ కైంకర్యాలు అనంతరం ఉదయం 8.15 గంటలకు ఆలయాన్ని మూసివేస్తామన్నారు. మళ్లీ చంద్రగ్రహణం ముగిసిన తరవాత రాత్రి 8గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ పూజలు నిర్వహించి, రాత్రి పది గంటలకు మళ్లీ ఆలయాన్ని మూసివేస్తామని పేర్కొన్నారు.

మరుసటి రోజు ఉదయం యథాప్రకారం ఆలయాన్ని తెరవడం జరుగుతుంది. గ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేయడంతో స్వామి వారి దర్శనాలు, సత్యనారాయణ వ్రతాలు, వాహనపూజలు, నిత్య కైంకర్యాలు, స్వామి వారి కల్యాణం, బ్రహ్మోత్సవం, ఊరేగింపు సేవలు రద్దు చేశారు. ఈ విషయాన్ని భక్తులు అందరూ గ్రహించాలని కోరారు.

యాదాద్రితో పాటు రాష్ట్రంలోని అన్ని ఆలయాలను రేపు ఉదయం నుంచి మూసివేయనున్నారు. తిరిగి బుధవారం ఉదయం నుంచే భక్తులను దర్శనాలకు అనుమతించనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.