హైదరాబాద్ అమీర్‌పేటలోని ఉమా ఆర్ట్ గ్యాలరీ ఆధ్వర్యంలో ఎకో గణేష్ నినాదంతో ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేశారు. రానున్న రోజుల్లో గణేశ్ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులనే పూజించాలని గ్యాలరీ నిర్వాహకురాలు డాక్టర్ శ్రీదేవి కోరారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు మట్టి వినాయకుడిని ప్రతిష్టించేలా కృషి చేయాలని ఆమె విన్నవించారు. మట్టి వినాయకుల తయారీలో పిల్లలకు శిక్షణ ఇప్పించడం ఎంతో గొప్పగా ఉందని తెలిపారు.
ఇదీ చూడండి :విధులు బహిష్కరించిన ఆంధ్ర బ్యాంకు ఉద్యోగులు