రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమం దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. సమాజం బాగుండాలనే తపన కలిగిన ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. భారత పారా బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్, బంగారు పతకం విజేత మానసి గిరీష్ చంద్ర జోషి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో మొక్కలు నాటారు. మనిషి స్వార్ధానికి ప్రకృతి చిన్నాభిన్నం అవుతండటంతోనే అనేక విపత్తులు సంభవిస్తున్నాయని ఆమె అన్నారు.
ఇలాంటి సమయంలో మొక్కలు నాటి ఈ భూమిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని మానసి అన్నారు. సమాజం పట్ల గౌరవం ఉన్న ప్రతీ ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కి మరో ముగ్గురిని నామినేట్ చేశారు. ప్రముఖ షూటర్ అన్జుమ్ మౌద్గిల్, రచయిత హర్నిద్ కౌర్, ఫ్యాషన్ స్టైలిస్ట్-బ్లాగర్ పాయల్ షా పటేల్‌లకు మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరారు.
ఇవీ చూడండి: గుండె, ఊపిరితిత్తులపై కరోనా దాడి.. రక్తనాళాలపై దుష్ప్రభావం