ETV Bharat / state

World Coconut Day: కొబ్బరి... కాయలు కొట్టడానికేనా? - కొబ్బరి పరిశ్రమలు వార్తలు

కోనసీమ అంటే గుర్తొచ్చేది.. పచ్చటి వరి పొలాలు.. వాటి మధ్యలోని ఎత్తైన కొబ్బరి చెట్లే. సంప్రదాయ సాగుకు అలవాటు పడిన రైతులు.. దశాబ్దాలుగా కొబ్బరి బోండాలు, కొబ్బరి కాయల ఉత్పత్తికి మాత్రమే పరిమితం అవుతున్నారు. విలువ ఆధారిత ఉత్పత్తుల దిశగా ఆలోచనలు కొరవడ్డాయి. ఈ పరిశ్రమల ఏర్పాటు దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదు. తుపాన్లను తట్టుకునే రకాలనూ అందుబాటులోకి తేవడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు రైతుల ఆదాయం మరింత తగ్గే ప్రమాదముంది.

world coconut day
కొబ్బరి
author img

By

Published : Sep 2, 2021, 10:45 AM IST

దశాబ్దాలుగా కొబ్బరి బోండాలు, కొబ్బరి కాయల ఉత్పత్తికి మాత్రమే పరిమితం అవుతున్నారు. విలువ ఆధారిత ఉత్పత్తుల దిశగా ఆలోచనలు కొరవడ్డాయి. ఈ పరిశ్రమల ఏర్పాటు దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదు. తుపాన్లను తట్టుకునే రకాలనూ అందుబాటులోకి తేవడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు రైతుల ఆదాయం మరింత తగ్గే ప్రమాదముంది

పొట్టి రకంతో మేలు..

కోస్తాలో కొబ్బరి చెట్లు పొడవుగా ఉండటంతో తుపాన్ల తాకిడికి నేలకూలుతుంటాయి. తిత్లీ సమయంలో ఉత్తరాంధ్రలో ఏకంగా 11 లక్షల చెట్లు నేల కూలాయి. వీటి పునరుద్ధరణకు ఏళ్లుగా శ్రమిస్తున్నారు. ఇక 1996లో వచ్చిన తుపానుకు గోదావరి జిల్లాల్లో కొబ్బరికి తీవ్రనష్టం వాటిల్లింది. వీటి స్థానంలో కొత్తగా మొక్కలు నాటి పెంచారు. అవి కాపు దశకు వచ్చే సమయంలో మళ్లీ తుపానులు విరుచుకుపడి నేలమట్టం చేశాయి.

  • ఫిజీలో కాంపాక్ట్‌ డ్వార్ఫ్‌, ఫిజీ డ్వార్ఫ్‌ అనే రకాలు 15 అడుగులకు మించి పెరగవు. వీటి కాండం లావుగా ఉంటుంది. తుపాన్లను తట్టుకుంటాయి. మన నేలకు అనుకూలంగా ఉంటాయి. చెట్టుకు 200 కాయల వరకు వస్తాయి. అంతర పంటగా... కోకో, మిరియాలు, దాల్చిన చెక్క, జాజికాయ వేసుకోవచ్చు. కొబ్బరి రేటు తగ్గినా.. వీటి ద్వారా ఆదాయం వస్తుంది. ‘కొబ్బరి కాండంతో.. టేబుళ్లు, కుర్చీలు, మంచాలు చేయొచ్చు. ఫిజీలో దీని ఆధారంగా పెద్ద పెద్ద పరిశ్రమలు ఉన్నాయి’ అని భారతీయ ఇంజినీరింగ్‌, సైన్స్‌ టెక్నాలజీ ఇన్నోవేషన్‌ విశ్వవిద్యాలయం(అనంతపురం) ఉపకులపతి, సీపీసీఆర్‌ఐ(మాజీ డైరెక్టర్‌) పాలెం చౌడప్ప సూచించారు.
.

రూగోస్‌తో భవిష్యత్తుపై బెంగ

శ్రీలంక నుంచి దిగుమతి అయిన సన్నంగి అనే రకానికి చెందిన మొక్కల ద్వారా రూగోస్‌ తెల్లదోమ మన దేశంలోకి చేరింది. కడియంలో 2016-17లో వెలుగు చూసిన ఈ దోమ దేశమంతా విస్తరించింది. దీని కారణంగా అయిదేళ్లుగా 30-40% దిగుబడులు తగ్గాయి.

.

రూగోస్‌ దోమ కారణంగా కొబ్బరి దిగుబడి భారీగా తగ్గుతోంది. బయో కంట్రోల్‌ ద్వారా దీన్ని నివారించవచ్చు. సూడోమొల్లాడ యాస్టర్‌ను ల్యాబ్‌లో అభివృద్ధి చేశాం. ఈ గుడ్లను ఎకరానికి 2000 నుంచి 3000 చెట్లపై ఉంచాలి. చెట్టుకు కింద నుంచి మూడు అడుగుల ఎత్తులో.. రెండున్నర అడుగులు ఎత్తు ఉండేలా పసుపు రంగులోని టార్పలిన్‌ షీట్లను కాండానికి చుట్టి.. పైన ఆముదం రాయాలి. వారానికోసారి శుభ్రం చేసి, మళ్లీ ఆముదం రాస్తుండాలి. కొబ్బరిలో విలువ ఆధారిత ఉత్పత్తులపై దృష్టి సారిస్తే రైతుల ఆదాయం పెరుగుతుంది.
- డాక్టరు భగవాన్‌, కొబ్బరి పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త, అంబాజీపేట

మార్చుకుంటే కల్పతరువే!

  • ఎంతో రుచిగా ఉండే కొబ్బరి నీరాను ప్యాకింగ్‌, బాట్లింగ్‌ చేయిస్తే... టెట్రా ప్యాక్‌లో అమ్మితే రైతుల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. దీన్నుంచి పంచదారనూ చేయొచ్చు.
  • బెంగళూరులో వీటి ఆకులతో పర్యావరణహిత స్ట్రాలు తయారు చేస్తున్నారు.
  • కొబ్బరి పీచుతో చేసే చాపల్ని కేరళలో కాలువ గట్లపై జియో టెక్స్‌టైల్స్‌గా వాడుతున్నారు. భూమి కోతనూ నివారిస్తున్నారు. పీచు నుంచి తాళ్లనూ తయారు చేస్తారు.
  • బోండాం నీటితో శీతల పానీయాలు చేసుకోవచ్చు. వర్జిన్‌ కొబ్బరి నూనెతో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. కొబ్బరి నుంచి ఐస్‌క్రీములు, పాలు, చిప్స్‌, డిస్కేటెడ్‌ పొడి చేయొచ్చు.
  • చిప్పల నుంచి తయారయ్యే బొగ్గును నీటి శుద్ధిలో ఉపయోగిస్తారు. నార తీసే సమయంలో వెలువడే పొడిని కంపోస్టు(ఎరువుగా) వాడొచ్చు.
  • పాలీహౌస్‌లో కొబ్బరి కోకోపిట్‌పై పెంచిన క్యాప్సికం, చెర్రీ టమోటా పంట ఉత్పత్తుల కొనుగోలుకు చాలా సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి.

ఇదీ చదవండి: Mental Health: మానసిక రోగుల్ని అలా చూస్తారా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.