మహాత్మ గాంధీ స్వాతంత్య్ర సమరంలో చూపిన పటిమ ఎంతో గొప్పదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. గాంధీజీ అనేక ఇబ్బందులను ఎదుర్కొని భారతమాత విముక్తి కోసం పోరాడారని కొనియాడారు. మహాత్ముని 150వ జన్మదినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నెలకొల్పేందుకు కృషి చేయాలని మంత్రి అన్నారు. అనంతరం ప్లకార్డులను పట్టుకుని 'సే నో టూ ప్లాస్టిక్' అంటూ నినాదాలు చేశారు.
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వెల్చాల ప్రవీణ్ రావు, మహాత్మగాంధీ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ సుధీర్‌కుమార్ పాల్గొన్నారు. అనంతరం గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు బోధన, బోధనేతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : ఆహార పదార్థాలు కలుషితమై 25 మందికి అస్వస్థత!