దేశవ్యాప్తంగా పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని నేషనల్ పెన్షన్ రిస్టోరేషన్ యునైటెడ్ ఫ్రంట్, తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ సంయుక్తంగా హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ఇవాళ నిరాహార దీక్షను చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షల పేరుతో విధిస్తున్న షరతులు సమంజసం కాదని నేషనల్ పెన్షన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు బీపీసింగ్ రావత్ మండిపడ్డారు.
కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ వల్ల ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన తెలిపారు. పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి కొత్త పెన్షన్ విధానాన్ని అమలు చేయడం దారుణమని మండిపడ్డారు. ఈ విధానాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేయాలంటూ నినాదిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
ఇవీ చూడండి: హైదరాబాద్ శివారులో దారుణం.. కూతుళ్లపై తండ్రి అఘాయిత్యం.