ETV Bharat / state

'పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌ రంగం భారత్‌లో ఇంకా వృద్ధి సాధించాలి' - హైదరాబాద్​లో జీఎస్​ఐ ఎన్​ఐఆర్​ఎం సంస్థల మీటింగ్

Work Shop on Pumped Storage Hydro Power Project : దేశంలో సహజ వనరుల తగ్గుదల, వాతావరణ మార్పుల దృష్ట్యా స్వచ్ఛమైన ఇంధన వనరుల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పునరుత్పాదక ఇంధన సామర్థ్యం వృద్ధిలో భాగంగా "పంప్‌డ్ స్టోరేజీ ప్రాజెక్టులను" వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపడుతోంది. ఈ మేరకు హైదరాబాద్‌లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ సంయుక్తంగా జాతీయ స్థాయి సదస్సు నిర్వహించి పలు అంశాలు చర్చించారు.

Work Shop on Safe sustainable Power Project
GSI and NIRM Meeting in Hyderabad
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 22, 2023, 12:00 PM IST

పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌ రంగం భారత్‌లో ఇంకా వృద్ధి సాధించాలి

Work Shop on Pumped Storage Hydro Power Project : హైదరాబాద్​లోని మాదాపూర్ నొవాటెల్‌లో "జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్" సంయుక్తంగా నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సు విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర భూగర్భ గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి కాంతారావు లాంఛనంగా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి జీఎస్​ఐ, ఎన్​ఐఆర్​ఎం సంస్థల అధిపతులు, శాస్త్రవేత్తలు, నిపుణులు సదస్సుకు తరలివచ్చారు. దేశం మొత్తం జల విద్యుత్ రంగం(Hydropower sector Issues)లో స్వచ్ఛమైన, పచ్చటి, స్థిరమైన ఇంధన వనరులు వినియోగించుకునే దిశగా ప్రయాణం ప్రారంభించిన దృష్ట్యా సానుకూల అంశాలు, సవాళ్లు - పరిష్కారాలపై ఈ సందర్భంగా విస్తృతంగా చర్చించారు.

Experts opinion on Pumped Storage Project : ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల ప్రభావం భారత్‌లోనూ ఉన్నందున సుస్థిర, స్థిరమైన పంప్‌డ్ స్టోరేజీ ప్రాజెక్టుల వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక - డీపీఆర్​(Pumped Storage Hydro Power Project Report) నిర్ధారించడంలో భూగర్భ శాస్త్రం, జియోటెక్నికల్, భూకంపాలు, భూసేకరణ, అటవీ అనుమతులు, పర్యావరణ సమస్యలు, శిలాజ రహిత ఇంధన వనరులు సమర్థవంతంగా అధిగమించేందుకు గల అవకాశాలను ఈ సందర్భంగా నిపుణులు ప్రస్తావించారు. 2030 నాటికి 500 గిగావాట్ల సంప్రదాయేతర ఇంధన శక్తి ఉత్పత్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యం నిర్ధేశించింది. మరిన్ని ఈ ఇంధన వనరుల ఉత్పత్తి ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం ద్వారా ఒత్తిళ్లు అధిగమిస్తూ లక్ష్యం దిశగా కృషి చేస్తున్నామని కేంద్ర భూగర్భ గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి వెల్లడించారు.

వాతావరణ మార్పుల చట్టానికి 'ఇండియన్​ థన్​బర్గ్'​ పోరాటం

"పునరుత్పాదక శక్తి సృష్టించడంలో పంప్‌డ్ స్టోరేజీ ప్రాజెక్టు ఒకటి. ఏదైనా ప్రాజెక్ట్​ను త్వరగా ప్రవేశపెట్టాలంటే అనుమతులు వేగంగా వచ్చేలా చూసుకోవాలి. ఈ వర్క్​షాప్​ ఉద్దేశం ఎవరైతే ప్రాజెక్ట్​ నిర్వహిస్తున్నారో ఏ ప్రదేశంలో స్టడీ చేయాలో, ఎలాంటి అంశాలు ఎంపిక చేసుకోవాలో వారికి తెలియజేయడం." - కాంతారావు, కేంద్ర భూగర్భ గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి

Work Shop on Safe sustainable Power Project : ఇతర దేశాలతో పోల్చితే పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌ రంగం భారత్‌లో ఇంకా వృద్ధి సాధించాల్సి ఉందని నిపుణులు తెలిపారు. హిమాలయాలు సహా హిమాలయేతర, దక్కన్ పీఠభూమిపై ఈ ప్రాజెక్టుల స్థాపనకు సన్నాహాలు సాగుతున్నట్లు పేర్కొన్నారు. పంప్‌డ్ స్టోరేజ్ హైడ్రో పవర్‌ డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టుల కోసం సమగ్ర, వేగవంతమైన మూల్యాంకన ప్రక్రియ నిర్ధారించేందుకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(Geological Survey of India) చర్యలకు ఉపక్రమించింది.

పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌ కల నెరవేర్చడానికి అవసరమైన అన్ని రకాల సహకారం, సాంకేతిక సాయం అందజేస్తోందని నిపుణులు చెబుతున్నారు. 2030 నాటికి శిలాజ ఇంధనం ఆధారిత ఇంధన వనరుల ద్వారా 50 శాతం సంచిత ఎలక్ట్రిక్ పవర్ స్థాపిత సామర్థ్యం సాధించాలనే లక్ష్యానికి సహకారమందించి పునరుత్పాదక ఇంధన అభివృద్ధి చేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు.

Cop26 Summit: వాతావరణ మార్పుల కట్టడిలో చేతలు కావాలి!

'పర్యావరణహిత మైనింగ్​ పద్దతులు పాటించేలా మైనింగ్​ ఇంజినీర్లే మార్గ నిర్దేశం చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.