ETV Bharat / state

యూట్యూబ్‌లో Women's Day స్పెషల్ వీడియోలు చూశారా..?

Women's Day Special 2023 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చేసింది. మార్చి 8 అయిన ఇవాళే ఈరోజును ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ మహిళలకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఎవరి వాట్సాప్ స్టేటస్ చూసినా.. ఇన్‌స్టా స్టోరీ చూసినా.. ఫేస్‌బుక్ పోస్టు.. ట్విటర్ ట్వీట్.. ఇలా ప్రతి సోషల్ మీడియా మాధ్యమంలోనూ విమెన్స్‌ డే స్పెషల్ స్టోరీలే కనిపిస్తున్నాయి. మహిళల ఔన్నత్యం.. మహిళలు సాధించిన అద్భుతాలు.. ఏళ్ల తరబడి వాళ్లు ఎదుర్కొంటున్న సవాళ్లు.. ఇలా రకరకాల వాటి గురించి పోస్టులు పెడుతున్నారు. రోజూలాగే నేను ఇవాళ కూడా లేవగానే నా మొబైల్ వంక చూశాను. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విటర్.. ఇలా ఏది ఓపెన్ చేసినా విమెన్స్ డే స్పెషల్ విషెస్, రీల్స్, పోస్టులే కనిపిస్తున్నాయి. అయితే వాటన్నింటిలో నన్ను కొన్ని వీడియోలు ఆకర్షించాయి. విమెన్స్ డే స్పెషల్ సందర్భంగా ఈ వీడియోలు చేసినట్టున్నారు. ఈ వీడియోల్లో అంతర్లీనమైన ఓ మెసేజ్ నా మనసును కదిలించింది. ఇలాంటివి ప్రతి ఒక్కరూ చూడాలి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.

Women's Day Special 2023
Women's Day Special 2023
author img

By

Published : Mar 8, 2023, 5:59 AM IST

Women's Day Special 2023 : నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాదీ ప్రపంచమంతా ఈ రోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటోంది. ఏడాదంతా ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరుగుతున్నా కఠిన చర్యలు తీసుకోలేని రాజకీయ నాయకులు ఇవాళ మాత్రం ప్రత్యేక కార్యక్రమాల్లో అతిథులుగా పాల్గొని ఆడవాళ్ల ఔన్నత్యం.. సాధికారత అంటూ మైకులు పగిలిపోయేలా ఉపన్యాసాలు ఊదరగొడుతున్నారు. ఇదంతా మనకెందుకులే మన పని మనం చూసుకుందామని ఆఫీసులకు వెళ్దామని ఆర్టీసీ బస్సు ఎక్కితే.. విమెన్స్ డే స్పెషల్ అంటూ టికెట్లకు ఆఫర్లు ప్రకటించారు. ఏడాదంతా ఇలా ఆఫర్ ఇస్తే ఎంత బాగుండేది. స్త్రీలకు మాత్రమే అని ప్రత్యేకంగా రాసి ఉన్న సీట్లలో కూడా కళ్లు కనిపించనట్టు రాజుల్లాగా కూర్చొనే మగమహారాజులు ఇవాళ మాత్రం విమెన్స్ డే స్పెషల్ అని మా సీట్లు మాకు వదిలేసి ఏదో ఉద్దరించినట్లు బిల్డప్ ఇస్తున్నారు.

Women's Day Special Videos : ఇది కూడా చూసీచూడనట్టు ఎలాగోల ఆఫీసుకు చేరుకున్నాను. అక్కడ కూడా ఇదే గొడవ. మేల్ డామినేటెడ్ ఆఫీసులో ఆడవాళ్ల పనికి అసలు కాస్త కూడా విలువివ్వని బాస్.. ఇన్నాళ్లూ ఆడవారి సమస్యలు పట్టించుకోని.. కనీసం పీరియడ్స్ టైంలో సిక్ లీవ్ కూడా ఇవ్వని మేనేజ్‌మెంట్.. స్త్రీలకు ప్రత్యేక గౌరవం.. మహిళలను గౌరవించడం.. వారు సాధించిన అద్భుతాలను సెలబ్రేట్ చేసుకోవడం మా బాధ్యత అంటూ స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏవో ప్లాన్ చేశారు. ఏడాదంత మేం ఉన్నాం అని కూడా పట్టించుకోని ఈ మేనేజ్‌మెంట్ ఇవాళ మాకు పట్టం కడుతూ ఏదో గొప్ప పని చేసినట్టు ఫీల్ అవుతోంది. ఈ షో భరించలేక ఆ ప్రోగ్రామ్ నుంచి ఎలాగోలా బయటపడ్డాను. కాస్త ఊపిరిపీల్చుకుందామని క్యాంటీన్‌కు వెళ్లి అలా ఓ కూల్‌డ్రింక్ తీసుకుని తాగాను. చుట్టూ చూస్తే ఎవరూ లేరు. అంతా విమెన్స్ డే ప్రోగ్రామ్‌లో బిజీగా ఉన్నారు. ఇక చేసేదేం లేక బోర్‌గా అనిపిస్తోందని ఫోన్‌ తీశాను.

Women's Day Special Youtube Videos : అలా వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విటర్.. ఇలా ఒకదాని వెంట మరొకటి ఓపెన్ చేశాను. అక్కడా మహిళా దినోత్సవం స్పెషల్ అంటూ ఊదరగొట్టే పోస్టులే దర్శనమిచ్చాయి. ఇక చికాకు వచ్చి యూట్యూబ్ ఓపెన్ చేశాను. ఈ మధ్య ఇన్‌స్టా రీల్స్ కంటే ఎక్కువ యూట్యూబ్ షాట్స్‌పైన ఆసక్తి పెరిగింది. సరేలే అనే యూట్యూబ్ షాట్స్ ఓపెన్ చేసి చూస్తున్నాను. ఇవాళ విమెన్స్ డే అని వీళ్లు కూడా ఏదో ఊదరగొడ్తారనే నిరాసక్తితోనే ఓపెన్ చేశాను. కానీ ఒక రెండు మూడు వీడియోలు చూసిన తర్వాత ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది.

విమెన్స్ డే స్పెషల్ వీడియోలట.. భలే గమ్మత్తుగా ఉన్నాయి. ఒక్కో వీడియో ఒక్కో వజ్రంలాగా అనిపించింది. ఉన్నది 30, 40 సెకన్లే అయినా.. ఆ వీడియోలో అంతర్లీనంగా ఎంతో నిగూఢ సందేశం ఉంది. ఆ 30 సెకన్లు గుండెని అలా తాకాయి. కొన్ని వీడియోలైతే ఏకంగా గుండెని మెలిపెట్టేశాయి. అలా ఓ నాలుగైదు వీడియోలు చూసిన తర్వాత ఎందుకో గుండె కాస్త భారంగా అనిపించింది. అలా నేను మెచ్చిన కొన్ని వీడియోలు ఈ విమెన్స్ డే స్పెషల్‌గా మీరు ఓసారి చూసేయండి. మీక్కూడా తప్పకుండా నచ్చుతాయి. ఒకవేళ మీరు అమ్మాయైతే.. అరే.. ఇలాంటి పరిస్థితి నాకూ ఎదురైందే అని తప్పకుండా అనుకుంటారు చూడండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

వీడియో 1 : సాధారణంగా ఆడవాళ్లకు ఏం ఇచ్చినా వాళ్లు దాన్ని తిరిగివ్వరు. మనం ఇచ్చిన దానికి రెండింతలు చేసి తిరిగి ఇస్తారు. మనం స్పెర్మ్ ఇస్తే వాళ్లు బిడ్డను కనిస్తారు. మనం నాలుగు గోడలను ఇస్తే వాళ్లు దాన్ని అందమైన ఓ పొదరిల్లుగా మారుస్తారు. అదే మనం నాలుగైదు రకాల సామాన్లు తెచ్చి పెడితే.. వాళ్లు ఓ రుచికరమైన భోజనం అందిస్తారు. అలాగే మనం మన ఫ్రస్ట్రేషన్ చూపించామనుకోండి.. ఇక అంతే సంగతులు. అందుకే బ్రదర్ మీరు ఆడవాళ్ల నుంచి ఏం రిసీవ్ చేసుకుంటున్నారో అది నచ్చకపోతే.. ముందు మీరేం ఇస్తున్నారో అది మార్చండి. ఆటోమేటిక్‌గా మీరు ఏం పొందుతారో అది మారిపోతుంది.

వీడియో 2 : ఈ వీడియోలో ఓ అమ్మాయి ఓ వృద్ధుడి వద్దకు వెళ్లి అడుగుతుంది. మీ కామన్ మ్యాన్ ఎప్పుడు మ్యానే ఎందుకు అవుతాడు. ఉమెన్ ఎందుకు కాదు అని. అప్పుడు ఆ ముసలాయన అదిరిపోయే రిప్లై ఇస్తాడు. ఉమెన్ ఎప్పుడూ కామన్ కాదు. ఎందుకంటే ఆడవాళ్లెప్పుడూ స్పెషలే. చాలా చాలా స్పెషల్. అందుకే కామన్ మ్యాన్.. నాట్ కామన్ ఉమెన్.

వీడియో 3 : ఈ వీడియోలో ఇద్దరు అత్తాకోడళ్లు కలిసి కొడుకు పని పట్టించేస్తారు. అత్తాకోడళ్లు ఇద్దరు ఇంటి పని విషయంలో గొడవ పడినట్టు యాక్ట్ చేస్తారు. అది భరించలేక కొడుకే వెళ్లి వంట చేస్తాడు. చివరకు ఇద్దరు అత్తాకోడళ్లు కూర్చొని కొడుకు చేసిన కాఫీ తాగుతూ యాక్టింగ్ ఇరగదీశాం.. రేపు లంచ్‌కి ఏం చేయమందామ్ అని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. వంటపని ఆడవాళ్లకు మాత్రమే అని భావించే మగవారికి ఈ వీడియో మంచి మెసేజ్ ఇస్తుంది. ఇద్దరు అత్తాకోడళ్లు కలిసి .. మగమహారాజులా తనను తాను భావించే ఓ పురుషుడి పని పడతారు.

ఈ వీడియో అయితే సూపర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. చాలా మంది టీనేజ్ అమ్మాయిలు ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. ఇంతకీ ఈ వీడియోలో ఏం ఉందంటే..? ఓ అమ్మాయి రాత్రిపూట ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తా అని తన తండ్రిని పర్మిషన్ అడుగుతుంది. తండ్రి ఆమెకు ఆన్సర్ ఇవ్వకుండా.. కొడుకు వైపు చూస్తూ.. బయటకెళ్లే సమయమా ఇది. ఇంత రాత్రి ఎవరైనా బయటకు వెళ్తారా..? ఇప్పుడు నువ్వు బయటకు వెళ్లి ఏ అమ్మాయినైనా ఏడిపిస్తే రేపు నీకు పెళ్లి చేయడానికి పిల్లను ఎవరిస్తారు అంటూ కొడుకువైపు గుర్రుగా చూస్తాడు. ఆ తర్వాత కూతురు వైపు చూస్తూ.. వెళ్లు కన్నా.. వెళ్లేటప్పుడు నీ తమ్ముడిని కూడా వాడి ఫ్రెండ్స్ దగ్గర డ్రాప్ చేసి వెళ్లు అని చెబుతాడు. రాత్రిపూట అమ్మాయిలు బయట తిరగడం సేఫ్ కాదని భావించే వారికి.. అమ్మాయిలు కాదు.. వారి స్వేచ్ఛను హరించే కొందరు మగవాళ్లు బయట తిరగకూడదని ఓ తండ్రి చెప్పడం ఈ వీడియోలో అల్టిమేట్ సీన్.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.