తమిళిసై సౌందర రాజన్... తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి మహిళా గవర్నర్. రాష్ట్రంలో అడుగుపెట్టిన నాటి నుంచే తనదైన శైలితో అందరికీ చేరువైన తత్వం ఆమెది. చిన్న నాటి నుంచి రాజకీయాల్లోకి రావాలన్న కోరికతో పెరిగిన తమిళిసై సౌందరరాజన్... తండ్రి బాటలో అడుగువేసినా.. ఆయన సిద్ధాంతానికి పూర్తి విరుద్ధమైన పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. వైద్యురాలిగా, రాజకీయ నేతగా, నేడు గవర్నర్‌గా వివిధ బాధ్యతల్లో ఉన్నా.. ఎప్పుడూ నిబద్ధత అనే సిద్ధాంతాన్ని నమ్మి ముందుకు సాగానంటున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి కోసం కింది లింక్‌ను క్లిక్ చేయండి.
పూర్తి కథనం: నాన్న కూతురిగా కాదు.. తమిళిసైగా ఎదగాలనుకున్నాను
ఆడదానివి ఆటో నడపడం ఏంటి? మా పరువు తీస్తున్నావ్.. అన్నారు కొంతమంది. మగరాయుడిలా ఆటో నడుపుతూ... ఊరుమీద తిరుగుతోందని గుసగుసలాడారు మరికొంతమంది. ఎవరెన్ని అన్నా... ఆమె ఆత్మస్థైర్యం కోల్పోలేదు. ఆ నోళ్లే ఇప్పుడు అద్భుతం అంటున్నాయి. కాలం కాటేసినా... గుండె నిబ్బరం చేసుకుని ముందుకు సాగుతున్న ఆ వనిత గురించి మనమూ తెలుసుకుందామా...!!
పూర్తి కథనం: రాణి జీవితం అందరికీ ఆదర్శణీయం!
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా పూర్తిగా మహిళా సిబ్బందితో దక్షిణ మధ్య రైల్వే ఒక రైలును నడుపుతోంది. బేగంపేట్ రైల్వే స్టేషన్‌లో మహిళలే విధులు నిర్వర్తిస్తున్నారు.
పూర్తి కథనం: ఇవాళ ఈ రైళ్లో అంతా మహిళా సిబ్బందే!
తండ్రి భారత ఉపరాష్ట్రపతి అయినా... ఆమెకు మాత్రం రాజకీయాలపై ఆసక్తి లేదు. చిన్నతనం నుంచి అలవడిన సేవాతత్పరతతో స్వర్ణ భారత్ ట్రస్ట్ స్థాపించిన ఉపరాష్ట్రపతి గారాల తనయ దీపా వెంకట్... ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, సామాజిక అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు.
పూర్తి కథనం: "సేవ చేయడానికి రాజకీయమొకటే మార్గం కాదు"
గరిటపట్టి ఘుమఘుమల రుచులు అందించే మహిళా మహారాణులు... కుంచెతో రమణీయ చిత్రాలు గీస్తున్నారు. ఒకప్పుడు వంటగదికే పరిమితమైన అతివలు... ఇప్పుడు వర్ణశోభితమైన చిత్రాలు వేయగలమని నిరూపించుకుంటున్నారు. వారిలో ఉన్న అద్భుతమైన కళతో బొమ్మలకు ప్రాణం పోస్తున్నారు. పురుషులతో సమానంగా విభిన్న చిత్రాలతో కళాభిమానుల మదిని దోస్తున్నారు.
పూర్తి కథనం:'వంటలే కాదు.. వర్ణశోభిత చిత్రాలూ గీయగలం'
బలంగా అనుకో...అయిపోతుంది’... అనే మాట మాధురి కనిత్కర్‌కు సరిగ్గా సరిపోతుంది. వైద్యవృత్తి స్వీకరించాలనుకున్నారు. స్వీకరించారు. సైన్యంలోనే సేవలందించాలనుకున్నారు. అందించారు. మిలటరీ నేపథ్యం ఏ మాత్రం లేని సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆమె త్రివిధ రక్షణ దళాల వైద్య విభాగానికి డిప్యూటీ ఛీప్‌గా పదోన్నతి పొందారు. దేశంలోనే ఈ హోదా సాధించిన మూడో మహిళా లెఫ్టినెంట్ జనరల్‌గా నిలిచారు. తాజాగా మూడు నక్షత్రాలను దక్కించుకున్న ఆర్మీ మహిళా అధికారిణిగా చరిత్ర సృష్టించారు.
పూర్తి కథనం: త్రివిధ దళాల్లో...త్రిబుల్‌స్టార్
హీరోయిన్ అంటే హీరో కోటుపై మెరిసే గులాబీ. హీరోని చూసీ చూడగానే ఒళ్లు మరిచి పరవళ్లు తొక్కి వాటేసుకుని పాటేసుకునే అందాల రాశి. చెట్టాపట్టాలేసుకుని చెట్టూ పుట్టా తిరుగుతూ సొంపులు సోయగాలను తెరపై పరిచేసే వయ్యారి. థియేటర్లో ముందు వరుస ప్రేక్షకులను అలరించే సొగసుగత్తె. ఇప్పటికీ ఇదే దృక్పథంతో తయారవుతున్న వేలవేల సినిమాల్లో నాయిక పరిస్థితి ఇదే.
పూర్తి కథనం:నాయికా మేలుకో.. వెండి తెరని ఏలుకో!
చదివింది డాక్టర్ కోర్సు... మొదట చేసిన ఉద్యోగం బ్యూటీ ఫీల్డ్‌కు సంబంధించినదయినా.. దేశ భక్తి... ఆమెను కమాండో ట్రైనింగ్ వైపు అడుగేసేలా చేసింది. పురుషులే అత్యంత క్లిష్టమైందిగా భావించే వృత్తి ఎంచుకుని వారికేమాత్రం తీసుపోనని.. దీటుగా నిలిచి నిరూపించారు భారతదేశ మొట్టమొదటి, ఏకైక మహిళా కమాండో ట్రైనర్ సీమా రావు.
పూర్తి కథనం: "జీవితమంటే అదే... పడి లేవడం.. పరుగు పెట్టడం"