అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఉన్నతాధికారిణులు ఘనంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సీపీ మహేష్ భగవత్, పోలీస్ అధికారులు, జీహెచ్ ఎంసీ అధికారులు, పెద్ద సంఖ్యలో మహిళ వసతి గృహ యజమానులు పాల్గొన్నారు.
ఆ సమయంలో 100కు ఫోన్ కొట్టాలి...
స్త్రీలు బయటకెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి అపాయమున్న పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందిన 7 నిమిషాల్లో పోలీస్ వాహనం వస్తుందని తెలిపారు. హైదరాబాద్లో షీ టీమ్స్ బాగా పనిచేస్తున్నాయని.. ఇబ్బందుల్లో ఉన్న మహిళలు సహకారం తీసుకోవాలని సూచించారు. మహిళా హాస్టల్స్ వద్ద సీసీ కెమెరాలు పెట్టాలని.. వారు ఎక్కడికి వెళ్తున్నారు.. ఎప్పుడు వస్తారు అనే సమాచారం భద్రపరుచుకోవాలన్నారు.
ఇవీ చూడండి : మూడుసార్లు గర్భవతిని చేశాడంటూ ప్రియుడి కోసం ధర్నా