ETV Bharat / state

NREGA SCHEME: కరోనా వేళ పేదలను ఆదుకున్న పథకం.. మహిళా కూలీలదే పైచేయి - employment guarantee scheme implementation in telangana

ఉపాధి హామీ పథకంలో మహిళలు తమ శక్తిని చాటుతున్నారు. పురుషులకు దీటుగా పలుగు, పార చేతబట్టి చెమటోడ్చుతున్నారు. నిన్నమొన్నటి వరకు వ్యవసాయ కూలీలుగా పొలంబాట పట్టిన మహిళలు.. నేడు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో దూసుకుపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పురుషులతో పోల్చితే మహిళా కూలీలే అధికంగా పనులు చేస్తుండటం దీనికి నిదర్శనం.

employment guarantee scheme
కరోనా వేళ పేదలను ఆదుకున్న పథకం
author img

By

Published : Aug 14, 2021, 8:19 AM IST

గ్రామీణ ప్రజలకు ఉపాధి హామీ పథకం ఓ వరంగా మారింది. పొలం పనులు లేని సమయంలో ‘ఉపాధి’ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నారు. మూడేళ్ల కాలంలో రాష్ట్రంలో ఈ పథకం కింద మొత్తం 1,35,91,079 మంది కూలీలు పనులకు హాజరయ్యారు. అందులో 76,96,676(56.63) మంది మహిళలు, 58,94,403 మంది పురుషులు ఉన్నారు. పురుషులతో పోల్చితే మహిళలే ‘ఉపాధి’లో పైచేయి సాధిస్తున్నారని ఈ లెక్కలు రుజువు చేస్తున్నాయి. మొదట్లో పురుషులే ఈ పథకం కింద అధికంగా పనులకు వెళ్లేవారు. ప్రస్తుతం స్త్రీలు ఎక్కువగా ఈ పనులకు హాజరవుతున్నారు. గడిచిన మూడేళ్ల వ్యవధిలో మహిళల హాజరు పది నుంచి పన్నెండు శాతం మేరకు పెరిగిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నిన్న మొన్నటి వరకు పొలంబాట పట్టిన మహిళలు... నేడు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో దూసుకుపోతున్నారు.

విపత్తు వేళ అండగా

కరోనా నేపథ్యంలో ప్రభుత్వం రెండు పర్యాయాలు లాక్‌డౌన్‌ను విధించింది. ఉపాధి వెతుక్కుంటూ పట్టణాలకు వెళ్లిన వారు తిరిగి పల్లెబాట పట్టారు. అలాంటి వారికి ఏడాదిగా ఉపాధి పనులే ఆసరా అయ్యాయి. ఉన్న ఊరిలోనే ఉపాధి దొరుకుతుండటంతో కూలీలు వలసలు మానుకున్నారు. ఈ పథకం పనులకే ఎక్కువగా హాజరవుతూ కుటుంబాలను పోషించుకుంటున్నారు.

మూడేళ్లుగా కామారెడ్డిదే ప్రథమ స్థానం

.

పేదలకు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించడంలో కామారెడ్డి జిల్లా గత మూడేళ్లుగా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలుస్తోంది. దీనికి గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ జిల్లాకు వరుసగా మూడు సార్లు అవార్డులను ప్రకటించింది.

ఇదీ చూడండి: 'పఠాన్‌కోట్‌ దాడికి స్థానిక పోలీసుల సాయం'!

GOVERNMENT SCHOOLS: సర్కారు పాఠశాలలకు ‘ప్రైవేట్‌’ నుంచి ప్రవేశాల ప్రవాహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.