ETV Bharat / state

మనస్తాపంతో వివాహిత బలవన్మరణం.. కారణమేంటంటే..!

భర్త, అత్తమామలతో జరిగిన గొడవ కారణంగా మనస్తాపానికి గురైన ఓ మహిళ ఒంటికి నిప్పంటించుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ దారుణం హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన గోపన్‌పల్లి తండాలో చోటుచేసుకుంది.

lady suicide in hydearbad
మనస్తాపంతో వివాహిత బలవన్మరణం.. కారణమేంటంటే..!
author img

By

Published : Jul 14, 2020, 2:16 PM IST

Updated : Jul 15, 2020, 10:34 AM IST

హైదరాబాద్​ నగర శివారు చందానగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని గోపన్‌పల్లి తండాలో విషాదం జరిగింది. ముప్పు అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న కంకణాల స్రవంతి (31) ఒంటికి నిప్పంటించుకొని బలవన్మరణానికి పాల్పడింది. భర్త కంకణాల సంతోశ్​, అత్తమామల వేధింపులే స్రవంతి ఆత్మహత్యకు కారణమని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. 2017లో సంతోశ్​తో స్రవంతికి వివాహం కాగా వారికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు.

అయితే సోమవారం రాత్రి స్రవంతికి భర్త సంతోశ్​, అత్తమామలతో గొడవ జరగడం వల్ల మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని చందానగర్ సీఐ రవీందర్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి: బాలిక అభ్యర్థనపై స్పందించిన కలెక్టర్..​ స్మార్ట్​ఫోన్​ కానుక

Last Updated : Jul 15, 2020, 10:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.