రాజకీయాల్లో సిద్ధాంత పరంగా నిబద్ధత చాలా ముఖ్యమని... అలాంటి సుగుణంతో ఈశ్వరీబాయి నాలుగు దశాబ్దాలపాటు సాగించిన ప్రజా జీవన ప్రస్థానం యువతకు స్ఫూర్తి కావాలని ఉపరాష్ట్ర పతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్‌లోని శిల్పారామంలో ఈశ్వరి బాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
భారత తపాలశాఖ రూపొందించిన ఈశ్వరి బాయి పోస్టల్ స్టాంప్‌ను.. వెంకయ్య నాయుడు, ట్రస్ట్ ఛైర్పర్సన్ గీతారెడ్డితో కలిసి ఆవిష్కరించారు. నేటి మహిళలు ఈశ్వరి బాయిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రజల సమస్యలపై అసెంబ్లీలో పోరాడి.. వాటిని పరిష్కరించేలా కృషి చేసిన గొప్ప మహిళ అని గుర్తుచేశారు.
కార్యక్రమంలో ట్రస్ట్ ఛైర్పర్సన్, కాంగ్రెస్ నాయకురాలు గీతారెడ్డి, హోమంత్రి మహమూద్ అలీ, టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, హన్మంతరావు, పోస్టల్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: మహిళకు పాస్టర్ వేధింపులు.. బాధితురాలికి అండగా కరాటే కల్యాణి