ETV Bharat / state

కరోనా కట్టడిలో మహిళా పోలీసులది ప్రత్యేక పాత్ర

కరోనా వైరస్‌ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌, రాత్రి వేళల్లో కర్ఫ్యు విధించాయి. వాటిని పటిష్ఠంగా అమలు చేయడంలో పోలీసులు తమ వంతు కీలక విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రధానంగా మహిళా కానిస్టేబుళ్ల పాత్ర ప్రధానమైనది. పోలీసు చెక్‌పోస్టులు, ఠాణాలు, ఐసోలేషన్‌, క్వారంటైన్‌ వార్డుల్లో వారు కత్తి మీద సాములా పని చేస్తున్నారు.

కరోనా కట్టడిలో మహిళా పోలీసులది ప్రత్యేక పాత్ర
కరోనా కట్టడిలో మహిళా పోలీసులది ప్రత్యేక పాత్ర
author img

By

Published : May 12, 2020, 7:00 PM IST

కరోనా వైరస్‌ కట్టడి, లాక్‌డౌన్‌ విధులు నిర్వర్తించడంలో పోలీసుల పాత్ర పట్ల సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రక్రియలో మహిళా పోలీసుల పాత్ర క్రియాశీలకంగా మారింది. ఠాణాల్లో ఒక్కోసారి అధికారులు ఎవరూ లేకపోయిన.. మహిళ సిబ్బంది ఠాణా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడం, కరోనా అనుమానితులు ఉన్నారంటూ ఎవరైనా పీఎస్​కు ఫోన్‌ చేస్తే చాలు అక్కడకు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అవరసమైతే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి అనుమానితులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

చెక్‌పోస్టుల వద్ద వాహనదారులను ఎందుకు బయటకు వచ్చారంటు ప్రశ్నించడం, అన్ని వివరాలు తెలుసుకుని అనవసరంగా రోడ్ల పైకి వచ్చినట్టు తేలితే కేసులు నమోదు చేస్తున్నారు. ఐసోలేషన్‌, క్వారంటైన్‌ వార్డుల్లో కూడా బందోబస్తు నిర్వర్తిస్తున్నారు. కరోనా వ్యాధి సోకిన వారిలో ధైర్యాన్ని నింపుతున్నారు. ఈ నేపథ్యంలో సిబ్బంది సేవలను గుర్తించిన ఉన్నతాధికారులు వారిని అభినందిస్తున్నారు.

కరోనా కట్టడిలో మహిళా కానిస్టుబుళ్లు చేస్తున్న కృషిని అభినందిస్తూ వారిని మరింత ప్రోత్సహించే విధంగా ప్రత్యేక గీతం రూపొందించినట్టు హైదరాబాద్​ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. మహిళా కానిస్టేబుళ్లు విశేషమైన సేవలు చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో వారు మరింత అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. మిగితా సమయంలో కంటే విపత్కర పరిస్థితుల్లో కీలకమైన విధులు నిర్వర్తించడం పట్ల పలువురు మహిళా కానిస్టేబుళ్లు సంతృప్తి వ్యక్తం చేశారు.

"ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. చరిత్రలో కూడా వస్తుందని అనుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు ఫ్రంట్​లైన్​ వారియర్స్​గా పనిచేస్తున్నారు. ఇప్పటివరకు మనం నిర్వహించిన విధులు వేరు.. ఈ వైరస్​ వ్యాప్తి నియంత్రణలో చేపట్టే విధులు వేరు. పురుషులతో సమానంగా మహిళా పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు."

-ప్రీతి, కార్ఖాన పోలీసుస్టేషన్‌ మహిళ కానిస్టేబుల్‌

"కొవిడ్​-19 వచ్చినప్పటినుంచి మన విధుల్లో చాలా మార్పులు వచ్చాయి. మా వద్దకు వచ్చే ఫిర్యాదు దారులతో జాగ్రత్తలు వహిస్తూ.. వారికి అవగాన కల్పిస్తున్నాం. పీఎస్​లో ఎప్పటికప్పుడూ శానిటైజర్​ స్ప్రే చేస్తున్నా. పక్కవారికి కొంచెం ఫ్లూ లక్షణాలు కనపడినా.. కరోనా వచ్చిందన్న అనుమానంతో ఫిర్యాదు చేస్తున్నారు. అలాంటి వారికి కూడా సరైన అవగాహన కల్పిస్తున్నాం.".

-అనూష, కాచిగూడ పోలీస్‌స్టేషన్‌ మహిళ కానిస్టేబుల్‌

కొవిడ్​ కట్టడిలో మహిళా కానిస్టుబుళ్లు తమ వంతు పాత్ర పోషిస్తూ ఉన్నతాధికారుల ప్రశంసలందుకుంటున్నారు. విధి నిర్వహణలో అడ్డంకులు ఎదురైనప్పటికీ వాటిని మనోధైర్యంతో ఎదుర్కొంటు ముందుకు పోవడం అభినందనీయం.

ఇదీ చదవండిః హైదరాబాద్​ను కమ్మేస్తున్న కరోనా..నగరవాసుల హైరానా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.