కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో నంద్యాలకు చెందిన మహిళ మిస్సింగ్ కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన యువతి, ప్యాపిలికి చెందిన నాగరాజు కుమారుడు మురళితో వివాహామైంది. ఉద్యోగ నిర్వహణలో భాగంగా భర్త ఖతార్ వెళ్లాడు. కలతచెందిన ఊహశ్రీ ఆత్మహత్య చేసుకుంటానంటూ ఉత్తరం రాసి జులై 5వ తేదిన ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. హయత్‌నగర్ కిడ్నాపర్ ఈమెను అపహరించాడన్న అనుమానంతో ఆమె బంధువులు జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కిడ్నాపర్‌కు ఈ మిస్సింగ్ కేసుకు ఎలాంటి సంబంధం లేదని సీఐ రమాణారెడ్డి తెలిపారు. త్వరలోనే ఊహశ్రీ ఆచూకీ కనుక్కుంటామని తెలిపారు.
ఇవీ చూడండి: కేంద్ర ఖాతా నుంచే పంచాయతీ ఖర్చులు..