ETV Bharat / state

VACCINE: కరోనా వ్యాక్సిన్​ తీసుకోవడంలో మహిళలు వెనుకంజ

బయటకు ఎక్కడికి వెళ్లట్లేదు. ఇంట్లోనే ఉంటున్నాం మాకేందుకు కరోనా వస్తుందనే అమాయకత్వం ఓ వైపు... టీకా కేంద్రాలు అందుబాటులో లేకపోవడం. ఈ రెండు కారణాలు మహిళలను వ్యాక్సిన్​కు దూరం చేస్తున్నాయి. మహానగరంలోని మూడు జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ప్రభుత్వమే ప్రత్యామ్నయం ఆలోచించి.. వారికి అవగాహన కల్పించి టీకా వేసుకునేలా ముందుకు నడిపించాలి. అలా అయితేనే మూడో దశ ముప్పును విజయవంతంగా ఎదుర్కోవచ్చంటున్నారు నిపుణులు.

VACCINE
మహిళలు వెనుకంజ
author img

By

Published : Aug 19, 2021, 6:37 AM IST

కరోనా కాలంలో కుటుంబానికి వెన్నుదన్నుగా నిలిచిన మహిళలకు వ్యాక్సిన్‌ అందించడంలో వెనుకబాటు కనిపిస్తోంది. మహానగరంలోని మూడు జిల్లాల పరిధిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కొవిడ్‌ టీకా తీసుకోవడంలో పురుషులతో పోల్చితే మహిళల సంఖ్య తక్కువగా ఉంటోంది. ఇందుకు కారణాలు.. అవగాహన లేకపోవడం, చాలా ప్రాంతాల్లో ఇంటికి సమీపంలో కేంద్రాలు ఉండకపోవడం. రెండు, మూడు కిలోమీటర్ల వెళ్లాల్సి వస్తోంది. గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. కొన్ని కేంద్రాల్లో రోజుకు 50 డోసుల కంటే ఇవ్వటం లేదు. ఈ డోసులు అయిన తర్వాత మిగతా వారికి తర్వాత రోజు రావాలని సూచిస్తున్నారు. చాలామంది మహిళలు తీసుకోవటానికి జంకుతున్నారు.

చాలా కేంద్రాల్లో ఏ రోజు ఏ టీకా... ఏ డోసు ఇస్తారో కూడా తెలియదు. ఒకసారి మొదటి డోసు ఇస్తే... రెండో రోజు రెండో డోసు ఇస్తున్నారు. రెండో డోసు అవసరమైన వారు ఇంకో కేంద్రానికి వెళ్లాల్సివస్తోంది. ఇంట్లో పనులు వదులుకొని కేంద్రానికి వచ్చిన తర్వాత పట్టించుకునే వారు ఉండటం లేదని చెబుతున్నారు. హైదరాబాద్‌ వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో మొదటి, రెండు కలిపి ఇప్పటి వరకు 35.18 లక్షల మందికి టీకాలు అందించారు. మహిళల కంటే పురుషులే ముందున్నారు. దాదాపు 4 లక్షల మంది అదనంగా వారు వ్యాక్సిన్‌ తీసుకున్నారు. రంగారెడ్డిలో కూడా అదే పరిస్థితి. మేడ్చల్‌లో మహిళల శాతం కాస్త మెరుగ్గా ఉంది.

ఇంటింటికి కార్యక్రమంతో అందరికి సాధ్యం...

ప్రస్తుతం సార్వత్రిక టీకా కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల వ్యాధి నిరోధక టీకాలను ఇంటింటికి వెళ్లి పిల్లలకు అందిస్తున్నారు. ఆసుపత్రులు, కమ్యూనిటీ సెంటర్లు, బస్టాండ్లు ఇతర ప్రదేశాల్లో పోలియో చుక్కలు లాంటివి ఇస్తున్నారు. ఇదే మాదిరిగా కరోనా టీకా కార్యక్రమం కూడా ఇంటింటికి చేపట్టాల్సిన అవసరం ఉంది. రోజూ ఒక కాలనీ లేదా ఒక ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ కార్యచరణ చేపట్టాలి. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే అక్కడ నుంచి ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్సు కూడా సిద్ధం చేయాలి.

చాలామంది మహిళలు ఇంటికే పరిమితం కావడం వల్ల తమకు మహమ్మారి సోకదనే ధీమాతో ఉన్నారు. పురుషులు బయట తిరిగి ఇంటికి వస్తుంటారు. వారి ద్వారానే మహిళలకు సోకే ప్రమాదం లేకపోలేదు. ఇంట్లో గర్భిణులు ఉంటే ఇతర మహిళల ద్వారా వీరికి వైరస్‌ ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంట్లో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అప్పుడే మూడో ముప్పును విజయవంతంగా అడ్డుకోవచ్చునని చెబుతున్నారు.

ఇదీ చూడండి: 'టీకా జాతీయవాదంతో కరోనా 'కొత్త' ముప్పు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.