ETV Bharat / state

Women Empowerment Through SERP : స్వయం సహాయక బృందాల సాయంతో.. 'మిలియనీర్లుగా మహిళలు' - సెర్ప్​ మహిళల అభివృద్ధి

Women Empowerment Through SERP : మహిళలు లక్షాధికారులు కావాలన్నది ఒకప్పటి మాట. కానీ, ఇప్పుడు కోటీశ్వరులు కావాలన్న లక్ష్యాలపై మహిళామణులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. స్వయం సహాయ బృందాల ఉద్యమం కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. భాగ్యనగరంలో పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో వార్షిక రుణ ప్రణాళికను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆవిష్కరించారు. రాబోయే రోజుల్లో ఏకంగా కోటీశ్వరులు అవ్వాలని ఆకాంక్షించారు.

Empowerment of women
Empowerment of women
author img

By

Published : May 31, 2023, 2:01 PM IST

Updated : May 31, 2023, 10:28 PM IST

స్వయం సహాయక బృందం చేస్తోంది మహిళలను కోటిశ్వరులు

Women Empowerment Through SERP : మహిళా లోకం ఆర్థిక స్వావలంబనను సాధిస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వయం సహాయక బృందాల మహిళలు ఔత్సాహిక వ్యాపారులు, పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. ఏటా పొదుపు పెరుగుతుండటంతోపాటు బ్యాంకులిచ్చే రుణాలు సద్వినియోగం చేసుకుంటూ ముందుకుసాగుతున్న తీరు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

హైద‌రాబాద్ బేగంపేట‌ మ్యారీ గోల్డ్ హోటల్లో పేద‌రిక నిర్మూల‌న సంస్థ - సెర్ప్ ఆధ్వర్యంలో బ్యాంకు లింకేజీ వార్షిక ప్రణాళిక‌ ఆవిష్కరించారు. 2023-24 సంవత్సరం సంబంధించి రూ.15037.40 కోట్లు స్వయం సహాయక బృందాలకు రుణాలు ఇవ్వాలన్న ప్రతిపాదనల మేరకు బ్యాంకు లింకేజీ వార్షిక ప్రణాళికను పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు.

2023 మార్చి 31 నాటికి రూ.17,426 కోట్లకుపైగా రుణాలు బకాయి ఉన్న 3.77 లక్షలుపైగా గ్రామీణ పేదకుటుంబాలు బ్యాంకింగ్ వ్యవస్థ రూపంలోకి తీసుకురాబడ్డాయి. ఫలితంగా గ్రామీణ పేదల జీవనోపాధిలో గణనీయమైన మార్పు వచ్చింది. సెర్ప్ సహకారంతో అన్ని రకాల బ్యాంకులు అన్ని అర్హతగల సమూహాలకు రుణాలు అందించడం ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తున్నాయి.

Women Development Through SERP : రాష్ట్రంలో 32 జిల్లాల్లో 98 శాతం మ‌హిళ‌లు భాగ‌స్వాములుగా డ్వాక్రా సంఘాలు ప‌ని చేస్తున్నాయి. 553 మండ‌ల స‌మాఖ్యలు, 4,30,358 స్వయం స‌హాయ‌క సంఘాల్లో 46,46,120 మంది మ‌హిళ‌లు స‌భ్యులుగా ఉన్నారు. స్వయం స‌హాయ‌క సంఘాల రుణ నిలువ ఈ ఏడాది 2023 మార్చి 31 నాటికి రూ.3,924.50 కోట్లుగా ఉంది. వార్షిక జీడీపీ వృద్ధి రేటు 15.6 శాతం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో తెలంగాణ ఒకటి.

వేగవంతమైన వృద్ధి రేటు ఉన్నప్పటికీ దేశ జనాభాలో 13.74 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్నారు. ఇదొక కీలకమైన సవాల్‌. ఆర్థిక వృద్ధిని కలుపుకొని ఉండేలా చూసుకోవడం, పేదరికాన్ని గణనీయంగా తగ్గించడానికి సమ్మిళిత వృద్ధి అనేది రాష్ట్ర విధానం. జనాభాలో బలహీన వర్గాలు, ముఖ్యంగా గ్రామీణ పేద మహిళలకు అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థ తీసుకురావడానికి రాష్ట్రం ప్రయత్నాలు చేస్తోంది. ఎస్‌హెచ్‌జీ-బీఎల్‌పీ కింద లక్ష కుటుంబాలను లక్ష స్వయం సహాయక సంఘాల ద్వారా కోటి రూపాయలు పైగా పొదుపు ద్వారా వార్షిక రుణం తీసుకుంటున్నాయి.

SERP helps for Women Development : రాష్ట్రంలో స్వయం సహాయక బృందాల పనీతీరు ఏయేటికాయేడు గణనీయంగా పెరుగుతోంది. దేశంలో... ప్రత్యేకించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎస్‌హెచ్‌జీ మహిళా సభ్యులకు పూచీకత్తు లేకుండా ఇతోధికంగా బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. 2014-15లో రూ.3,738 కోట్లు రుణాలు ఇవ్వగా... 2022-23లో రూ.12,722 కోట్లు రుణాలు ఇచ్చింది. గ‌త ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.3,500 కోట్ల మేర రుణవిలువ పెరిగింది. బ్యాంకుల వారీగా వడ్డీ రేట్లు తేడాలు, సర్వీసు ఛార్జీలు రద్దుచేయాలన్న విజ్ఞప్తులపై బ్యాంకర్లు సానుకూలంగా స్పందించారు.

మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు 69 ఏర్పాటై విజయవంతంగా నడుస్తున్న వేళ... ఈ ఏడాది మరో 70 ఎఫ్‌పీఓలు నెలకొల్పనున్న దృష్ట్యా మహిళలు ముందుకు రావాలని సెర్ఫ్ సూచించింది. కిరాణా దుకాణాలు, హోటళ్లు, టైలరింగ్, పాడి వ్యాపారాలు విజయవంతంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇటీవల కామారెడ్డి జిల్లాలో నాబార్డు సహకారంతో 300 మంది మహిళలు సమగ్ర చేపల పెంపకం చేపట్టి రాణిస్తున్నారు. చిరుధాన్యాల సాగు, అదనపు విలువ జోడింపు, మార్కెటింగ్‌పై శ్రద్ధపెట్టిన తరుణంలో సేంద్రీయ వ్యవసాయం ప్రోత్సహించి ఆ నాణ్యమై ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించనుంది.

'ప్రతి సంవత్సరం శ్రీనిధి లోన్​ తీసుకుంటున్నాం, పొదుపులో వచ్చే బ్యాంకు లోన్​ తీసుకుంటున్నాం అలా ప్రతి సంవత్సరం ఒక్కొక్క గేదె కొంటూ వచ్చాను. రోజుకు పది లీటర్ల పాలు విక్రయిస్తున్నాను. అంటే రోజుకు వెయ్యి రుపాయలు సంపాదిస్తున్నాను. రెండు సంవత్సరాల తర్వాత మా అత్తగారికి నాకు ఇద్దరికి లోన్లు వచ్చాయి. ఇప్పుడు మేము 50లీటర్ల దాకా పాలు అమ్ముతున్నాం. మాకు అన్ని ఖర్చులు పోగా రూ.65 నుంచి 70 వేల వరకు మిగులుతుంది. ఒక్క గేదెతో మొదలై ఇప్పుడు 25 గేదెలు ఉన్నాయి.' -అనిత నవాబుపేట, నిజామాబాద్ జిల్లా.

రాష్ట్రంలో మహిళా వ్యవస్థాపక విజయం, స్ఫూర్తిదాయకమైన కథలు విస్తృత ప్రాచుర్యంలోకి తీసుకురావాలని సర్కారు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆర్థిక స్వావలంబన దిశగా సాగుతున్న ప్రయాణంలో గ్రామీణపేద కుటుంబాలన్నింటినీ ఎస్‌హెచ్‌జీ మోడ్‌లోకి తీసుకురావడంలో సెర్ప్, స్త్రీనిధి ప్రశంసనీయమైన పురోగతి సాధిస్తుండటం విశేషం.

ఇవీ చదవండి:

Last Updated : May 31, 2023, 10:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.