మహిళలు పోలీస్ స్టేషన్‌కు రాకుండా క్యూ ఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదు చేసే విధానాన్ని మహిళా భద్రతా విభాగం పోలీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు. మహిళా దినోత్సవం సందర్భంగా క్యూఆర్ కోడ్ విధానాన్ని డీజీపీ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. మహిళలు వేధింపులకు గురైనా, సైబర్ నేరాల బారిన పడినా... ఉన్న చోటు నుంచే క్యూఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. చరవాణిలో లింకును భద్రపర్చుకుని... అవసరమైనప్పుడు ఆ లింక్‌ను తెరవగానే క్యూర్ కోడ్ వస్తుంది. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే ఫిర్యాదుకు సంబంధించిన వివరాలు వస్తాయి. దరఖాస్తును పూర్తిగా నింపిన అప్లై చేయగానే సంబంధిత షీ టీమ్ పోలీసులకు వెళ్తుంది.
పోలీసు అధికారులు స్పందించి వెంటనే దర్యాప్తు ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఫిర్యాదులన్నీ ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో కనిపిస్తుంటాయి కాబట్టి... అందుకు సంబంధించిన పురోగతిని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. ఫిర్యాదు దారులు సైతం పోలీసు సేవల పట్ల తమ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు పంచుకోవచ్చు. ఈ విధానం ద్వారా మహిళలకు మరింత నాణ్యమైన, సత్వర సేవలు అందించే అవకాశం ఉంటుందని మహిళా భద్రతా విభాగం అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి : 25 లక్షలు ఫట్.. ఇంట్లోంచి ఎస్కేప్