హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రహ్మత్ నగర్‌లో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. తానుంటున్న భవనం మూడో అంతస్తు నుంచి కిందపడి చనిపోయింది. మృతురాలు సామర్లకోటకు చెందిన స్వాతిగా పోలీసులు గుర్తించారు. ఆమెది ఆత్మహత్యనా లేక ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయిందా అనేది దర్యాప్తులో తేలనుందని పేర్కొన్నారు. మృతురాలి ఇద్దరు కుమారులు మాత్రం తమ తల్లి భవనం నుంచి కిందపడి చనిపోయిందని ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి: 111 కిలోల గంజాయి సీజ్...ఐదుగురి అరెస్ట్