వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ మండలం కడిపికొండ గ్రామంలో విషాదం జరిగింది. కరోనా నిర్ధరణ కోసం వెళ్లిన చాగంటి లలిత (45) అనే మహిళ పరీక్ష కేంద్రం ఎదుటే మృతి చెందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న మృతురాలి బంధువులు మృతదేహాన్ని వారి ఇంటికి తీసుకుని వెళ్లారు.
చాగంటి లలిత అనే మహిళ భర్త మూడేళ్ల క్రితం మృతి చెందడంతో కడిపికొండ గ్రామంలో తన తల్లితో కలిసి ఉంటోంది. కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది. కరోనా లక్షణాలు కనింపిచడంతో గ్రామంలో నిర్వహించే నిర్ధరణ పరిక్ష కోసం వెళ్లింది. పరీక్ష కేంద్రం వద్దకు చేరుకుని బయటే కుప్పకూలిపోయింది. ఆమెను పరీక్షించిన వైద్యుల లలిత మృతి చెందినట్లు నిర్ధారించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు మృతదేహాన్ని మంచంపై వేసి అంత్యక్రియలకు తరలించారు.
ఇదీ చదవండి: కాసులు దండుకుంటే.. కఠిన చర్యలే : మంత్రి పువ్వాడ