రేపటి నుంచి సచివాలయ అధికారులు, ఉద్యోగులు అంతా పూర్తి స్థాయిలో విధులకు హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లాక్డౌన్ సడలింపులను సాయంత్రం ఐదు గంటల వరకు పొడిగించిన సర్కారు... పూర్తి స్థాయి ఉద్యోగులతో ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయాలని తెలిపింది. అందుకు అనుగుణంగా సచివాలయంలో పనిచేసే అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అందరూ సాధారణ విధులకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
లాక్డౌన్ విధింపు నుంచి ప్రభుత్వ కార్యాలయాలు 50 శాతం మంది ఉద్యోగులు, సిబ్బందితోనే పనిచేశాయి. విడతలవారీగా సడలింపు సమయాలు పెంచగా… ఆమేరకు ఆఫీసులూ పనిచేసేలా సర్కారు చర్యలు చేపట్టింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షల సడలింపులు ఇవ్వగా… ఆ వేళల్లో 100 శాతం ఉద్యోగులు కార్యాలయాలకు రావాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
ఇదీ చదవండి: Vaccination: పిల్లలకు అన్ని టీకాలు వేయాల్సిందే..!