ETV Bharat / state

ఈనెల 18 నుంచి వింగ్స్ ఇండియా 2024 - బేగంపేట ఎయిర్‌పోర్టుకు బోయింగ్ 777-9 విమానం

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 16, 2024, 10:51 AM IST

Wings India Hyderabad 2024 : అంతర్జాతీయ విమానాల ప్రదర్శనకు హైదరాబాద్‌ మరోసారి వేదిక కానుంది. బేగంపేట్ విమానాశ్రయంలో నాలుగు రోజుల పాటు వింగ్స్ ఇండియా పేరుతో భారీ ప్రదర్శన నిర్వహించనున్నారు. కేంద్ర పౌర విమానయానశాఖ సహకారంతో ఫిక్కీ ఆధ్వర్యంలో వింగ్స్ ఇండియా ప్రదర్శన చేపట్టబోతున్నారు. దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద విమానమైన బోయింగ్‌తో పాటు పలు రకాల విమానాలను ఈ షోలో ప్రదర్శించనున్నారు.

Wings India Aviation Show In Hyderabad
Wings India Aviation Show
వింగ్స్ ఇండియాకు సర్వం సిద్ధం - బోయింగ్‌తో పాటు పలు రకాల విమానాల ప్రదర్శన

Wings India Hyderabad 2024 : విమాన రంగానికి మరింత ఊతమిచ్చే ఉద్దేశంతో నిర్వహిస్తున్న వింగ్స్ ఇండియా ప్రదర్శనకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం ముస్తాబవుతోంది. ఈ నెల 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు వింగ్స్ ఇండియా కార్యక్రమం నిర్వహించనున్నారు. నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ ప్రదర్శనలో దేశ విదేశాలకు చెందిన అధునాతన విమానాలు కనువిందు చేయనున్నాయి. విమానయానానికి ప్రజలను మరింత చేరువ చేయడంతో పాటు ఈ రంగానికి ఉన్న అవకాశాలను వ్యాపారవేత్తలకు, అంకుర పరిశ్రమలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వింగ్స్ ఇండియా ప్రదర్శన నిర్వహిస్తున్నారు.

Wings India 2024 Air Show In Begumpet : వైమానిక రంగంలో ప్రపంచంలోనే ఇండియా మూడో అతిపెద్ద దేశంగా ఎదుగుతోంది. ఒక నగరం నుంచి ఇంకో నగరానికి విమానంలో ప్రయాణించే వాళ్ల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. 1748 విదేశీ విమానాలతో పాటు 1440 దేశీయ విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. మరో వెయ్యి విమానాలు భారత పౌర విమానయాన రంగంలో చేరుతాయనేది అంచనా. 2028 సంవత్సరానికి దేశానికి వచ్చే అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య 3కోట్లకు పైగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 184 జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాలున్నాయి.

ఆకట్టుకున్న ఎయిర్​ షో.. అబ్బురపరిచిన వైమానిక విన్యాసాలు

మరో ఏడాదిలో దాదాపు 40 విమానాశ్రయాలను కొత్తగా అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. క్రిషి ఉడాన్ 2.0 స్కీం కింద ఇప్పటికే దేశంలోని 29 రాష్ట్రాలకు విమాన సౌకర్యం కల్పించారు. వైద్యం కోసం విదేశాల నుంచి వచ్చే వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంది. 21శాతం వృద్ధి కనిపిస్తోంది. పదేళ్ల వ్యవధిలో పర్యాటక రంగం, వైమానిక రంగం నుంచి వచ్చే ఆదాయం 119 బిలియన్ డాలర్ల నుంచి 270 బిలియన్ డాలర్లకు పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అవకాశాలను అందిపుచ్చుకోవడానికి పలు వైమానిక సంస్థలు ముందుకొస్తున్నాయి.

నీలాకాశంలో ఫైటర్ జెట్స్ ​ వాయుసేన అద్భుత విన్యాసాలు

Wings India 2024 Aviation Expo Exhibition Show : వ్యాపారవేత్తలు, అంకుర పరిశ్రమలు, విమాన ఆపరేటర్లు, తయారీదారులు, సాంకేతిక పరిజ్ఞానం అందించే సాఫ్ట్‌వేర్‌ సంస్థలను ఒకచోట చేర్చడానికి వింగ్స్ ఇండియా ప్రదర్శన ఎంతో దోహదపడుతోంది. ఈసారి జరిగే ప్రదర్శనలో 106 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. అంతే కాకుండా 5వేల మంది వైమానిక రంగానికి చెందిన వ్యాపారవేత్తలు హాజరై పలు ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. 200 విమానాలు ప్రదర్శనకు రానున్నాయి. లక్ష మంది ఈ ప్రదర్శనను తిలకించే అవకాశం ఉంది.

ప్రపంచంలోనే అతిపెద్దదైన బోయింగ్ 777-9 విమానం బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకోనుంది. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వింగ్స్ ఇండియా కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోంది. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు వాహనాలను మళ్లించనున్నారు. పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చూడాలని సీఎస్ శాంతికుమారి, జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు.

తెలంగాణలో నేటినుంచి 'వింగ్స్ ఇండియా' ఏవియేషన్‌..!

Wings India 2022: భాగ్యనగరం వేదికగా వింగ్స్ ఇండియా-2022 ఏవియేషన్ షో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.