ETV Bharat / state

'బదిలీలు చేపట్టకుంటే సామూహిక సెలవులకెళ్తాం' - ERST WHILE DISTRICTS

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో భాగంగా అంతర్ జిల్లాలకు బదిలీ చేసిన తహసీల్దార్లను పూర్వ జిల్లాలకు పంపాలని ఆ సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఈ విషయంపై రేపు సీఎస్​కు నోటీసు అందిస్తామని పేర్కొన్నారు.

16న మళ్లీ సమావేశమై భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తాం : తహసీల్దార్ల సంఘం
author img

By

Published : Jul 7, 2019, 5:12 PM IST

Updated : Jul 7, 2019, 6:20 PM IST

ఈనెల 9 నుంచి వర్క్ టూ రూల్ పాటిస్తామని తహసీల్దార్ల సంఘం నేతలు వెల్లడించారు. ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా పలు జిల్లాలకు బదిలీ చేసిన తహసీల్దార్లను పూర్వపు జిల్లాలకు పంపించాలని డిమాండ్ చేశారు. సీసీఎల్ఏలోని టీజీటీఏ కార్యాలయంలో తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్ నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు.
ఈ నెల 9 నుంచి 12 వరకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విధులు నిర్వహిస్తామన్నారు. మధ్యాహ్న భోజన సమయంలో మాత్రం నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు. 15 న రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక సెలవులకు వెళ్తామని తెలిపారు. ప్రభుత్వం స్పందించకుంటే 16 న మళ్లీ సమావేశమై భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.

సామూహిక సెలవులపై రేపు సీఎస్​కు నోటీసు అందిస్తాం : తహసీల్దార్ల సంఘం

ఇవీ చూడండి : ఇది ప్రజాధన దుర్వినియోగమే : ఉత్తమ్​

sample description
Last Updated : Jul 7, 2019, 6:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.